Jayakrishna: మహేష్ బాబు కాకుండా జయకృష్ణకు బాగా ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? అతను స్టార్ కాదు అంతకు మించి..

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతను నటించిన మొదటి సినిమా 'శ్రీనివాస మంగాపురం' జులై 30న గ్రాండ్ రిలీజ్ కానుంది. రవీనా టాండన్ కూతురు రషా తడానీ ఇందులో హీరోయిన్ గా నటించింది.

Jayakrishna: మహేష్ బాబు కాకుండా జయకృష్ణకు బాగా ఇష్టమైన హీరో ఎవరో తెలుసా? అతను స్టార్ కాదు అంతకు మించి..
Mahesh Babu, Jayakrishna Ghattamaneni

Updated on: Jul 22, 2026 | 6:51 PM

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడు వస్తున్నాడు. దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నాడు. అతను హీరోగా నటించిన మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం. ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి డిఫరెంట్ సినిమాలు తీసిన అజయ్ భూపతి జయకృష్ణ డెబ్యూ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ కూతరు రషా తడానీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. తిరుపతి పుణ్యక్షేత్రం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ప్రేమకథా చిత్రం ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకుంది. ఈ నెల 30న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో చిత్ర బృందం వరుసగా ప్రమోషన్స్ చేస్తోంది. హీరో జయకృష్ణ కూడా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. అలా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఘట్టమనేని ఫ్యామిలీ కాకుండా ఇష్టమైన హీరో ఎవరని ప్రశ్నించగా ఆసక్తికర సమాధానమిచ్చాడు జయకృష్ణ.

‘ ప్రజెంట్ రామ్ చరణ్ గారు మై ఫేవరెట్ హీరో. ఆయన స్టార్ హీరో కంటే కూడా ఓ మంచి యాక్టర్, పెర్ఫార్మర్. స్టార్ అనేది మన చేతుల్లో లేదు. అది ఆడియెన్స్ కు నచ్చితే వచ్చేది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ వైడ్‌గా క్రేజ్ సొంతం చేసుకున్నారు రామ్ చరణ్. ఆ తర్వాత కూడా పాన్-ఇండియా రేంజ్‌లో ఆయన నటిస్తున్న తీరు నన్ను ఎంతగానో ఇన్ స్పైర్ చేసింది. చిరంజీవి కుమారుడిగా మెగా పవర్ స్టార్ సాధించిన విజయం యంగ్ జెనరేషన్ నటులకు ఎంతో స్ఫూర్తినిస్తుంది’ అని జయకృష్ణ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

జయకృష్ణ బర్త్ డే సెలబ్రేషన్స్..

శ్రీనివాస మంగాపురం విషయానికి వస్తే.. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ఈ సినిమాను సమర్పిస్తుండగా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పి. కిరణ్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

శ్రీనివాస మంగాపురం సినిమా ప్రమోషన్లలో జయకృష్ణ, రషా తడాని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us