Fariya Abdullah: జాతి రత్నాలు బ్యూటీలో మరో టాలెంట్.. బెల్లీ డ్యాన్స్‏తో అదరగొట్టిన చిట్టి..

మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది. ఈ మూవీ తర్వాత ఫరియాకు

Fariya Abdullah: జాతి రత్నాలు బ్యూటీలో మరో టాలెంట్.. బెల్లీ డ్యాన్స్‏తో అదరగొట్టిన చిట్టి..
Faria Abdulla

Updated on: Jul 07, 2022 | 1:43 PM

డైరెక్టర్ అనుదీప్ కెవి తెరకెక్కించిన జాతి రత్నాలు సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాకు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. కామెడీ ఎంటర్టైనర్‏గా వచ్చిన ఈ  మూవీలో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటించింది (Faria Abdullah). మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా.. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను దొచుకుంది. ఈ మూవీ తర్వాత ఫరియాకు అంతగా అవకాశాలు రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగార్రాజు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్‏లో అదరగొట్టింది చిట్టి. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

అయితే మొదటి నుంచి తనకు డ్యాన్స్ అంటే ఎంత ఇష్టమో ఫరియా గతంలోనే చెప్పుకొచ్చింది. గతంలో ఫరియా తీన్ మార్ స్టెప్పులేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా బెల్లీ డాన్స్‏తో అదరగొట్టింది ఈ చిన్నది. నాభి అందాలను చూపిస్తూ బెల్లీ డాన్స్ సూపర్బ్‏గా చేసింది. ఇక ఈవీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్స్ షాకింగ్ రియాక్షన్స్ ఇస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us