
దళపతి విజయ్ నటించిన జననాయగన్ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. సీఎం విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నటించిన చివరి సినిమా ఇదే.. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే తాను పూర్తిగా రాజకీయాల్లోకి ఏడుగుపెడుతున్నట్టు.. ఇక పై సినిమాల్లో నటించను అని విజయ్ తెలిపారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్. తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎంగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు విజయ్. ఈ క్రమంలో ఇప్పుడు జన నాయగన్ సినిమా విడుదలకు మోక్షం లభించింది. ఈ చిత్రం జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకత్వం వహించగా, పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హెచ్. వినోద్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా జన నాయగన్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు కొన్ని మార్పులు చేర్పులు చెప్పింది అవేంటంటే.. అంబేద్కర్ విజువల్స్: ఒక పుస్తకం కవర్ పై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కనిపించే విజువల్స్‌ను మార్చారు. అలాగే టీవీకే పదం తొలగింపు: “అంబేద్క… టూ… టీవీకే ” అనే డైలాగ్‌ను మార్చారు. అలాగే ఆడియో, వీడియోలో టీవీకే పదాన్ని మ్యూట్ చేసి, మార్చారు. అదేవిధంగా ఒక సీన్‌లో భారత జాతీయ జెండా కింద పడుతున్నట్లు ఉన్న విజువల్‌ను పూర్తిగా తొలగించారు.” భగవతన్”, “రంగనాథర్” అనే పదాలతో పాటు కొన్ని బూతు పదాలను మ్యూట్ చేశారు.
వీటితో పాటు ‘ఓం’ పదం తొలగింపు: ‘ఆపరేషన్ మెలూహా’ గురించి వివరించే డైలాగ్‌లో “ఓం” పదాన్ని తొలగించారు. అదే సీన్‌లో సద్దాం హుస్సేన్‌ను ఉరితీయడం గురించి ఉన్న డైలాగ్‌ను మ్యూట్ చేశారు లేదా మార్చేశారు. జిల్లా కలెక్టర్ బ్యాడ్జ్‌ను అగౌరవపరిచేలా కింద పడేసినట్లు ఉన్న విజువల్‌ను తీసేసి వేరే విజువల్ పెట్టారు. “పొన్నోడ… కుడుతు వచిరుక్కను, ఉడంబు ఎరుక్కును” అని మొదలయ్యే డైలాగ్‌ను పూర్తిగా మ్యూట్ చేశారు. అలాగే “ఇండియా ఎన్ కళ్ల విఝ వైకారెన్” అనే డైలాగ్‌ను కూడా మ్యూట్ చేశారు.అదేవిధంగా సినిమాలో ఓ చిన్నారిని తగలబెడుతున్నట్లు ఉన్న విజువల్‌ను తొలగించారు. “సిలువయిల్ల” అనే పదాన్ని మ్యూట్ చేశారు. సినిమాలో ఎక్కడైనా “శీలా రాణి” అనే పేరు వస్తే దాన్ని వేరే పేరుతో మార్చాలని ఆదేశించారు. మొత్తంగా 20 సెకన్ల తొలగింపులు, 10 సెకన్ల రీప్లేస్మెంట్లు తర్వాత కూడా సినిమా మొత్తం నిడివి 3 గంటల 3 నిమిషాలు (183 నిమిషాల 11 సెకన్లు) గానే ఉందని తెలుస్తుంది. మరి జన నాయగన్ సినిమా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి