ఆ హీరో సీన్లు చాలా కట్ చేశారు.. జైలర్ 3లో పనిచేయనంటున్న కాస్ట్యూమ్ డిజైనర్!

‘జైలర్’ సినిమాలో మోహన్‌లాల్ అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన స్క్రీన్ ప్రజెన్స్‌కు అభిమానుల్లో మంచి స్పందన లభించింది. దీంతో సీక్వెల్‌లోనూ ఆయన పాత్రపై ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. కానీ సినిమా చూసిన తర్వాత కొంతమంది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆ హీరో సీన్లు చాలా కట్ చేశారు.. జైలర్ 3లో పనిచేయనంటున్న కాస్ట్యూమ్ డిజైనర్!
Jailer 2

Updated on: Oct 16, 2026 | 3:48 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘జైలర్ 2’ భారీ హిట్ అందుకుంది. ఈ సినిమా పై మొదటి నుంచయి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలు మించి సినిమా ఉండటంతో ఆడియన్స్ సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యంగా రజినీకాంత్ ఎలివేషన్స్ అలాగే స్పెషల్ స్టార్స్ గెస్ట్ రోల్స్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో చాలా మంది స్పెషల్ రోల్స్ లో కనిపించారు. వారిలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఒకరు. జైలర్ లో ఆయన పాత్ర ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దాన్ని కొనసాగిస్తూనే జైలర్ 2లోనూ  ఆయన కనిపించారు. అయితే ఆయన పాత్రను చాలా వరకు కట్ చేశారని తెలుస్తుంది. మోహన్‌లాల్ పోషించిన మాథ్యూ పాత్రకు సంబంధించిన సన్నివేశాల కట్ చేయడంపై వివాదం తెరపైకి వచ్చింది. సినిమాలో ఆయనకు సంబంధించిన పలు సీన్లను తొలగించడంపై కాస్ట్యూమ్ డిజైనర్ జిషాద్ షంషుద్దీన్ అసంతృప్తి వ్యక్తం  చేశాడు. అయితే, షూటింగ్ సమయంలో సిద్ధం చేసిన కొన్ని లుక్స్, సన్నివేశాలు సినిమాలో కనిపించకపోవడంపై జిషాద్ షంషుద్దీన్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

మోహన్‌లాల్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన మూడు విభిన్న కాస్ట్యూమ్ లుక్స్‌కు సంబంధించిన సన్నివేశాలు ఎడిటింగ్‌లో తీసేశారని ఆయన తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నాడు. ట్రైలర్‌లో కనిపించిన సన్నివేశాన్ని సైతం కుదించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మోహన్‌లాల్ వంటి స్టార్ నటుడి పాత్రకు సంబంధించిన సన్నివేశాలను ఇలా తగ్గించడం తనను బాధించిందని జిషాద్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఒక నటుడి స్క్రీన్ ప్రజెన్స్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, షూటింగ్ సమయంలో చేసిన పనికి సినిమాలోనూ గుర్తింపు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డాడు.

అంతేకాదు, భవిష్యత్తులో ‘జైలర్ 3’ తెరకెక్కితే ఆ ప్రాజెక్టులో పనిచేయడానికి ఆసక్తి చూపనని జిషాద్ షంషుద్దీన్ అన్నాడు . ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ పాత్రకు సంబంధించిన సన్నివేశాల కత్తిరింపుపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అసలు సరైన రోల్ ఇచ్చే ఆలోచన లేనప్పుడు ఆయనను పిలవడం ఎందుకు? అంటూ కొందరు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్, మోహన్‌లాల్ వంటి దిగ్గజ నటులు ఒకే సినిమాలో కనిపిస్తే అభిమానుల్లో అంచనాలు సహజంగానే పెరుగుతాయి. అలాంటి సమయంలో ఒకరి పాత్రకు సంబంధించిన సన్నివేశాలు కట్ చేయడం కరెక్ట్ కాదు అని మోహన్ లాల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us