
విలక్షణ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు హీరోగా, ఆ తర్వాత విలన్ గా, ఇప్పుడు సహాయ నటుడిగా అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తెలుగులో ఓ స్టార్ హీరో గురించి తన మనసులోని మాటలు బయటపెట్టారు. ఆయన మరెవరో కాదు.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘రెబల్ స్టార్’ ప్రభాస్ కి కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు, తోటి నటీనటులు కూడా వీరాభిమానులే. ఆయనకున్న మంచి మనసు, ఆతిథ్యం, తోటివారిపై చూపే ప్రేమ గురించి ఇండస్ట్రీలో ఎంతోమంది గొప్పగా చెప్పుకుంటారు. జగపతి బాబు ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ గుణగణాల గురించి, వారి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి పంచుకున్న విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..
జగపతి బాబు మాట్లాడుతూ, ఇండస్ట్రీలో తనకు బాగా నచ్చిన, అత్యంత ఇష్టమైన వ్యక్తి ప్రభాస్ అని పేర్కొన్నారు. ప్రభాస్ కి ఎవరికైనా సహాయం చేయడం, ఇవ్వడం మాత్రమే తెలుసని, ఇతరుల నుండి ఆశించడం లేదా అడగడం అనేది ఆయన నిఘంటువులోనే లేదని ప్రశంసించారు. ఎవరు ఏం అడిగినా సరే కాదనకుండా ఇచ్చేసే గొప్ప మనస్తత్వం ప్రభాస్ సొంతం. తన జీవితంలో ఎదురైన ఒక క్లిష్ట పరిస్థితిని గుర్తుచేసుకుంటూ జగపతి బాబు ఎమోషనల్ అయ్యారు. తాను తీవ్రమైన మానసిక ఒత్తిడిలో (Depressed) ఉన్న సమయంలో, ప్రభాస్ ఎక్కడో జార్జియాలో షూటింగ్‌లో ఉన్నారట. ఆ సమయంలో జగపతి బాబు ప్రభాస్‌కు ఫోన్ చేసి, తాను మానసికంగా కొంత ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..
దానికి ప్రభాస్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా, “డార్లింగ్! నేనున్నాను కదా, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు, నేను సాల్వ్ చేస్తాను” అంటూ ఎంతో ప్రేమగా, ధైర్యంగా సమాధానమిచ్చారు. వయసులో తనకంటే చిన్నవాడైనప్పటికీ, ప్రభాస్ చూపించిన ఆ చొరవ, బాధ్యత తనను ఎంతగానో ఆకట్టుకుందని జగపతి బాబు చెప్పారు. ప్రభాస్ కేవలం మాటలు చెప్పడమే కాదు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని జగపతి బాబు అన్నారు. “నిజానికి నాకు ఆయన నుండి ఏమీ అవసరం లేదు. కానీ ఆ కష్ట సమయంలో ఆయన అందించిన చిన్న ఓదార్పు, ఆ ఒక్క నమ్మకమైన మాటే నాకు కొండంత బలాన్ని ఇచ్చింది. ఆ మాటతోనే నేను మళ్లీ కోలుకుని, పుంజుకోగలిగాను” అని జగపతి బాబు అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..
Prabhas
ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..