Jagapathi Babu: బాలీవుడ్ లోకి జగపతి బాబు.. స్టార్ హీరోకు తండ్రిగా నటించననున్న విలక్షణ నటుడు

|

Jun 13, 2021 | 11:47 PM

హీరో టూ పవర్‌ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ట్రాన్స్‌ఫాం అయిన జగపతి బాబు.. ప్రజెంట్ మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో వరుస సినిమాలతో యమా జోరుమీదున్నారు.

Jagapathi Babu: బాలీవుడ్ లోకి జగపతి బాబు.. స్టార్ హీరోకు తండ్రిగా నటించననున్న విలక్షణ నటుడు
Follow us on

Jagapathi Babu:

హీరో టూ పవర్‌ ఫుల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ట్రాన్స్‌ఫాం అయిన జగపతి బాబు.. ప్రజెంట్ మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో వరుస సినిమాలతో యమా జోరుమీదున్నారు. సెకండ్‌ ఇంన్నింగ్స్‌లో సక్సెస్‌ ఫుల్ గా కెరీర్ను బిల్డ్‌ చేసుకుంటూ మరింతగా క్రేజ్‌ సంపాదించుకుంటున్నారు. విలన్ గా, తండ్రిగా, వ్యాపారవేత్తగా ఆయన పోషిస్తున్న పాత్రలు ఆయనకు మంచి పేరు తీసుకొస్తున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో జగపతిబాబు నిర్మాతగా కూడా మారే ఆలోచనలో ఉన్నారు అని ప్రచారం కూడా కొంతవరకు జరుగుతోంది. ఒకప్పుడు ఆర్థికంగా నష్టపోయిన జగపతిబాబు మళ్లీ సినిమాలు వరుసగా రావడంతో ఆర్ధికంగా, సినిమాల పరంగా నిలబడ్డారు. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా ఆయనకు మంచి ఆఫర్లు వస్తున్నాయి.

లేటెస్ట్ బజ్‌ ప్రకారం హీరో జగపతి బాబు ఓ బాలీవుడ్ క్రేజీ మూవీకి సైన్‌ చేశారట. స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ హీరోగా భారీ బడ్జెట్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఓ కీ రోల్‌ కోసం.. సౌత్‌ యాక్టర్ ను తీసుకుందామని అనుకున్నారట ఈ మూవీ మేకర్స్‌. అందుకోసం రీసెంట్గా జగపతిని కలిసి ఓకే కూడా చెప్పించుకున్నారట.అయితే ఈ సినిమాలో అక్షయ్‌కు తండ్రిగా ఓ సౌత్‌ యాక్టర్‌ నటిస్తున్నారంటూ బాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. ఆ సౌత్‌ యాక్టర్ జగపతి బాబేనా కాదా అనేది ఇంకా తెలియల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న అక్కినేని యంగ్ హీరో.. మైత్రి మూవీస్ బ్యానర్ లో అఖిల్

Salman Khan: మరో సూపర్ హిట్ సినిమాపైన కన్నేసిన సల్మాన్.. విజయ్ సినిమాను రీమేక్ చేయనున్న భాయ్ జాన్..

మరోసారి కనువిందు చేయనున్న పవర్ స్టార్ సమంత జోడీ.. హరీష్ శంకర్ సినిమాలో పవన్ సరసన కుందనపు బొమ్మ