Jabardasth Pavitra: నాన్న ఫుల్‌డ్రింకర్‌.. 13 ఏళ్లుగా మాటల్లేవ్‌.. ఆయన చనిపోతే హ్యాపీగా ఫీలయ్యా: జబర్దస్త్‌ పవిత్ర

ఎప్పుడూ నవ్వుతూ కనిపించే కొందరు కమెడియన్ల వెనక ఎవరికీ తెలియని కన్నీటి కష్టాలు దాగుంటాయి. అయితే వాటన్నిటినీ మర్చిపోయి మనకు నవ్వులు పంచుతుంటారు. అలాంటి వారిలో జబర్దస్త్‌ పవిత్రా ఒకరు.

Jabardasth Pavitra: నాన్న ఫుల్‌డ్రింకర్‌.. 13 ఏళ్లుగా మాటల్లేవ్‌.. ఆయన చనిపోతే హ్యాపీగా ఫీలయ్యా: జబర్దస్త్‌ పవిత్ర
Jabardast Pavithraa

Updated on: Feb 15, 2023 | 1:12 PM

కొందరు మనకు ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంటారు. పక్కనున్న వారిని కూడా నవ్విస్తుంటారు. అయితే అలాంటి వారి జీవితాల్లో మనకు తెలియని విషాదం దాగుందంటారు. కొందరి జీవితాలను చూస్తే ఇది నిజమనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా తారల జీవితాల్లో.. ఎప్పుడూ నవ్వుతూ కనిపించే కొందరు కమెడియన్ల వెనక ఎవరికీ తెలియని కన్నీటి కష్టాలు దాగుంటాయి. అయితే వాటన్నిటినీ మర్చిపోయి మనకు నవ్వులు పంచుతుంటారు. అలాంటి వారిలో జబర్దస్త్‌ పవిత్రా ఒకరు. మొదట టిక్‌టాక్‌ వీడియోలు చేసుకునే ఆమె ఆతర్వాత కొన్ని సీరియల్స్‌లోనూ నటించింది. అయితే జబర్దస్త్‌లోకి వచ్చాక ఆమె జాతకం మారిపోయింది. తన అద్భుతమైన కామెడీ పంచులు, డైలాగులతో ఆకట్టుకుంది. బుల్లెట్‌ భాస్కర్, హైపర్ ఆది, మంకీ వెంకీ, రాఘవ టీమ్స్‌ లో కనిపిస్తూ కడుపుబ్బా నవ్విస్తోంది. అలా పాగల్‌ పవిత్రగా మనకు నవ్వులు పంచుతున్న ఆమె జీవితంలో కొన్ని కన్నీటి కష్టాలున్నాయి. వీటి గురించి పలు సందర్భాల్లో ఓపెన్‌ అయ్యిందామె. తాజాగా తన లైఫ్‌లోని మరికొన్ని చేదు అనుభవాలు, విషాదాలను బయటపెట్టింది పవిత్ర.

‘ మా నాన్న లారీ డ్రైవర్‌. అమ్మ పొలం పనులకు వెళ్లేది. ఇద్దరూ పని చేస్తే కానీ పూట గడవని ఫ్యామిలీ మాది. ఒక్కోసారి మూడు పూటలు కడుపు నింపుకోవడానికి ఆలోచించేవాళ్లం. దీనికి తోడు నాన్న తాగుడుకు బానిసయ్యాడు. మమ్మల్ని గాలికొదిలేశాడు. మా పిన్ని సాయంతో ఇంటర్‌ వరకు చదువుకున్నాను. ఇంకా వాళ్లను కష్టపెట్టడం ఎందుకని చదువుకు గుడ్‌ బై చెప్పేశాను. హైదరాబాద్‌కు వచ్చి సెలూన్‌ పార్లర్‌ పెట్టుకున్నాను. అప్పుడే అనుకోకుండా జబర్దస్త్‌లో అవకాశం వచ్చింది. సెలూన్‌కు కూడా డిమాండ్ తగ్గిపోవడంతో దాన్ని అమ్మేసి ఆ డబ్బుతో సొంతూరులో సొంత ఇల్లు కొనుక్కున్నాం. తాగుడు కారణంగా నాన్నతో 13 ఏళ్లు మాట్లాడలేదు నేను. ఆయన ముఖం చూడడానికి కూడా ఇష్టపడేదాన్ని కాదు. ఏడాది క్రితం ఆయన చనిపోయారు. ఆక్షణం నేను ఎంతో సంతోషంగా ఫీలయ్యాను’ అని తన ఆవేదనను పంచుకుంది పవిత్ర.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Loading...
Unable to load recommendations.
Follow Us