AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Komaram: హోటల్లో పనిచేశా.. పర్సులు, నైటీలు, గొడుగులు అమ్మేవాడిని.. ఇప్పుడు ఇలా

జబర్దస్త్ కమెడియన్ కొమరం అలియాస్ కొమురక్క గతంలో ఓ ఇంటర్వ్యూలో తన జీవితంలోని కష్టాలను, జబర్దస్త్ షో తర్వాత తన లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. కొమరం తన అసలు పేరు కుమార్ అని తెలిపారు. ఆయన తన ప్రయాణాన్ని పేదరికం, కష్టాలతో సాగినట్లు గుర్తుచేసుకున్నారు.

Jabardasth Komaram: హోటల్లో పనిచేశా.. పర్సులు, నైటీలు, గొడుగులు అమ్మేవాడిని.. ఇప్పుడు ఇలా
Jabardasth Komaram
Rajeev Rayala
|

Updated on: Aug 25, 2026 | 1:02 PM

Share

జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కమెడియన్ కొమరం, అయితే జబర్దస్త్ లో తన కామెడీతో, పంచులతో నవ్వులు పూయించాడు.  కొమరక్క అనే తన స్క్రీన్ నేమ్ వెనుక ఉన్న ఆసక్తికర కథనాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఎమ్మెల్యే క్రాంతి తల్లి కొమరమ్మ పేరు నుండి స్ఫూర్తి పొంది, కామెడీలో మరింత స్వేచ్ఛను పొందడానికి ఆ పేరును కొమరక్కగా మార్చినట్లు తెలిపారు. కొమరం కెరీర్ లో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. పదవ తరగతి తర్వాత హైదరాబాద్‌కు వచ్చి, తాజ్‌మహల్, కామత్, నందిని, అమృత, సుదర్శన్, ఉడిపి వంటి పలు హోటళ్లలో ఎనిమిదేళ్ల పాటు పనిచేశా అని తెలిపాడు కొమరం. అలాగే బేగంబజార్‌లో పర్సులు, ఎఫ్‌ఎం రేడియోలు, నైటీలు, గొడుగులు వంటివి అమ్ముతూ నిజాయితీగా డబ్బు సంపాదించానని తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ, గోకుల్ చాట్ వంటి ప్రాంతాలలో పోలీసులు తనను కొట్టిన సంఘటనలను గుర్తుచేసుకున్నారు.

అసలు ఆ సినిమా చేయాలనుకోలేదు.. అనుకోకుండా చేశాం..! పెద్ద హిట్ అయ్యింది

తన జీవితంలో కీలక మలుపు తన భార్య మద్దతుతో వచ్చిందని కొమరం తెలిపాడు. ఒకప్పుడు కూలి పనులు చేస్తూ నెలకు రూ. 4,500 జీతంతో జీవించిన తనను, సినిమాలలో ప్రయత్నించమని ఆమె ప్రోత్సహించిందని తెలిపారు.  ఆమె బాబును చూసుకుంటూ, టైలరింగ్ చేసుకుంటూ ఐదేళ్లపాటు ప్రతి నెలా రూ. 3,000 తన అకౌంట్‌లో వేస్తూ అండగా నిలిచిందని గుర్తుచేసుకున్నారు. సినిమా రంగంలోకి వెళ్తుంటే గ్రామాల్లోని బంధువులు, స్నేహితులు తన భార్యకు వేధింపులకు గురిచేశారని, అయినప్పటికీ ఆమె ధైర్యంగా నిలబడిందని కొమరం తెలిపారు.

మహేష్ బాబుకు అమ్మగా నటించాలని ఉంది.. ఆ ఛాన్స్ ఎప్పుడొస్తుందో.!

ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు కొమరం. ట్రాఫిక్ ఎస్సై, హెడ్ కానిస్టేబుల్, రైతు, సైకో, అఘోరా వంటి విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా రవితేజ నటించిన ఇరుముడి నటించి మెప్పించాడు. ఇరుముడి సినిమాలో ఉన్న నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు కొమరం. కొమరక్క గెటప్ నుండి బయటపడి ఒక నటుడిగా అన్ని రకాల పాత్రలకు న్యాయం చేయడమే తన లక్ష్యమని కొమరం స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

చూడటానికి అలా ఉంటుంది కానీ.. ఆమెకు పొగరెక్కువ..! సాయి పల్లవి నిజస్వరూపం ఇదే అంటున్న యంగ్ హీరో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

Follow Us