ఈ మధ్యకాలంలో సినిమాలు త్వరగానే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొత్త సినిమాలో థియేటర్స్ లో రిలీజ్ అయిన కొద్దిరోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంటే ఓటీటీలోనూ పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయినా నెలరోజులకు ఓటీటీలోకి వస్తున్నాయి. అలాగే కొన్ని సినిమాలు వారం రోజులకో రెండు వారాలకో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త సినిమా కూడా ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఆ సినిమానే బాక్. తమిళ్ లో హారర్ నేపథ్యంలో తెరకెక్కిన అరణ్మణై సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత ఈ సినిమా సిరీస్ లో చాలా సినిమాలు వచ్చాయి. అన్ని మంచి విజయాలను అందుకున్నాయి.
ఇప్పుడు ఇదే సిరీస్ లో అరణ్మణై 4 వచ్చింది. ఈ సినిమాకు తెలుగులో బాక్ అనే టైటిల్ ను పెట్టారు. ఈ సినిమాలో గ్లామరస్ భామలు తమన్నా, రాశి ఖన్నా నటించారు. ఈ సినిమాకు డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుందని తెలుస్తుంది.
బాక్ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే బాక్ సినిమా ఓటీటీలోకి ఈ సినిమా రానుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ బాక్ సినిమా రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుందని తెలుస్తోంది. మే 31 నుంచి జూన్ 10 లో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ సినిమా రైట్స్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది. మే 3న బాక్ సినిమా గ్రాండ్ గా థియేట్సర్స్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఇప్పుడు ఆడియన్స్ ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.