Yash : లంకేశుడిగా రాఖీ భాయ్‌.. యశ్ ఆ సినిమాలో రావణాసురుడుగా కనిపించనున్నాడా..?

|

Jun 09, 2023 | 9:13 AM

ఇప్పుడు నయా అవతార్‌లో మన ముందుకు రానున్నారు. తనకు అచ్చొచ్చిన యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ జోనర్‌ను కాసేపు పక్కకు పెట్టి.. మైథలాజికల్ జోనర్లో మన ముందుకు వస్తున్నారు.

Yash : లంకేశుడిగా రాఖీ భాయ్‌.. యశ్ ఆ సినిమాలో రావణాసురుడుగా కనిపించనున్నాడా..?
Yash
Follow us on

నిన్న మొన్నటి వరకు రాఖీ భాయ్‌గా.. బాక్సాఫీస్ ముందు రఫ్పాడించిన కన్నడ రాకింగ్ స్టార్ యశ్‌.. ఇప్పుడు నయా అవతార్‌లో మన ముందుకు రానున్నారు. తనకు అచ్చొచ్చిన యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ జోనర్‌ను కాసేపు పక్కకు పెట్టి.. మైథలాజికల్ జోనర్లో మన ముందుకు వస్తున్నారు. అందరి మైండ్ బ్లో అయ్యేలా.. పురాణ పురుషుడిగా.. దశకంఠుడిగా.. పది తలల రావణాసురిడిగా.. తన నట ప్రావీణ్యం మనకు చూపించేందుకు రెడీ అవుతున్నారు.

అడ్వాన్స్‌ టెక్నాలిజీతో సాయంతో.. మైథలాజికల్ స్టోరీలను.. మరో లెవల్లో ఆవిష్కరిస్తున్న ఈ రోజుల్లో.. ఇప్పటికే తెరకెక్కిన ప్రభాస్‌ ఆదిపురుష్ సినిమాను మించేలా.. బాలీవుడ్లో మరో రామయణం తెరకెక్కుతోంది. నితిష్ తివారీ డైరెక్షన్లో.. భారీ బడ్జెట్‌తో ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. ఇక ఈ సినిమాలో రావణాసురిడిగా.. కన్నడ రాకింగ్ స్టార్ యశ్ నటిస్టున్నారనే టాక్ బీ టౌన్ నుంచి లీకై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇక రావణ సంహారం చేసే రాముడి పాత్రలో రణ్బీర్‌ కపూర్.. సీత క్యారెక్టర్లో ఆలియా భట్ కన్ఫర్మ్ అయ్యారనే టాక్ కూడా బీ టౌన్లో జోరుగా వినిపిస్తోంది. వినిపించడేమ కాదు.. రణ్బీర్ ఆలియా.. రీసెంట్‌గా డైరెక్టర్ నితిష్ తివారీని కలిసిన ఫోటోలు వీడియోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.