అందుకే నాకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు.. అసలు విషయం చెప్పిన ఇంద్రజ

తెలుగు సినిమా రంగంలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి ఇంద్రజ తన సినీ ప్రస్థానం, వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వివాహానికి ఆరు నుండి ఎనిమిది నెలల ముందు సినిమాలను వదిలివేసినట్లు ఆమె తెలిపారు .

అందుకే నాకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు.. అసలు విషయం చెప్పిన ఇంద్రజ
Indraja

Updated on: Feb 23, 2026 | 8:10 AM

ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ఆతర్వాత  సినిమాలకు దూరమైన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కొందరు సెకండ్ ఇన్నింగ్స్ పేరుతో సహాయక పాత్రల్లో నటిస్తున్నారు. మరికొందరు పూర్తిగా సినిమాలకు దూరం అవుతున్నారు. అలాంటి వారిలో ఇంద్రజ ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు,. ముఖ్యంగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యమలీల సినిమా ఇంద్రజ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆతర్వాత కృష్ణ లాంటి స్టార్ హీరోలతోనూ కలిసి నటించింది ఈ అమ్మడు. కెరీర్ పీక్ లో ఉండగానే సినిమాలకు బ్రేక్ ఇచ్చారు ఇంద్రజ. పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేసిన ఆమె ఇప్పుడు టీవీ షోలతో పాటు పలు సినిమాల్లో సహాయక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇటీవలే ఆమె ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యామిలీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. కెరీర్ తొలినాళ్లలో టాలీవుడ్ లో గ్లామరస్ దుస్తులు ధరించడం పట్ల అసౌకర్యంగా భావించినట్లు ఇంద్రజ పేర్కొన్నారు. ఆ కారణంగానే తెలుగులో సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టినట్లు ఆమె చెప్పుకొచ్చారు. అయితే, తన తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మలయాళ చిత్రసీమలో అడుగుపెట్టిన ఇంద్రజకు అక్కడ మహారాణిలా స్వాగతం లభించిందట. చీరలు, లంగా ఓణీలు వంటి సంప్రదాయ దుస్తులు ధరించే పాత్రలలో నటించాలనే తన కోరిక అక్కడ నెరవేరిందని తెలిపారు. మలయాళంలో ఎలాంటి గ్లామర్ పాత్రలు చేయకుండానే విజయవంతంగా అనేక చిత్రాలలో నటించా.. ఇదే సమయంలో తమిళ్‌లో కూడా నాలుగు లేదా ఐదు చిత్రాలు చేశా అని తెలిపారు ఇంద్రజ.

2006లో వివాహం జరిగిన తర్వాత, ఒక సంవత్సరంలోనే పాప జన్మించింది. దీంతో, పాప పెద్దయ్యేంత వరకు కుటుంబానికే తన సమయాన్ని కేటాయించానని ఇంద్రజ తెలిపారు. అలాగే ఇంద్రజ తన కెరీర్‌లో రెండు మెమొరబులు సంఘటనలను పంచుకున్నారు. మొదటిది ఎస్.వి. కృష్ణారెడ్డి తన జంతర్ మంతర్ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చిన క్షణం. రెండవది గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన సొగసు చూడ తరమా చిత్ర అనుభవం. రాజమండ్రిలో షూటింగ్‌లో ఉండగా, డేట్ క్లాష్ కారణంగా గుణశేఖర్ టీమ్ హైదరాబాద్‌లో మూడు రోజులు తన కోసం వేచి ఉన్నారని, ఆసమయంలో గుణశేఖర్ చాలా కోప్పడ్డారని.. అప్పుడు మేనేజర్ కమ్యూనికేషన్ లోపం వల్ల తనకు తెలియదని ఆమె తెలిపారు. ఈ సంఘటన తర్వాత గుణశేఖర్ కోపాన్ని తగ్గించుకుని, ఆమెను అర్థం చేసుకున్నారని, ఆ సినిమా తనను గ్లామర్ హీరోయిన్ నుంచి మంచి పర్ఫార్మర్ గా నిలబెట్టిందని ఇంద్రజ గుర్తు చేసుకున్నారు. ఇవి తన జీవితంలో మరచిపోలేని మధురమైన జ్ఞాపకాలని ఆమె అన్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us