Honey Rose: బాలయ్య బిజీ కాలేకపోతోన్న బ్యూటీ.. హనీరోజ్ నెక్స్ట్ సినిమా ఏంటి.?

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ వయ్యారి భామ ప్రేక్షకులను తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ముద్దుగా బొద్దుగా చూడచక్కని రూపంతో ఆకట్టుకున్న ఈ భామ తన నటనతోనూ ఆకట్టుకుంది. వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ అవడంతో ఈ భామకు వరుస ఆఫర్స్ క్యూ కడతాయని అంతా అనుకున్నారు.

Honey Rose: బాలయ్య బిజీ కాలేకపోతోన్న బ్యూటీ.. హనీరోజ్ నెక్స్ట్ సినిమా ఏంటి.?
Honey Rose

Updated on: Jun 18, 2023 | 9:34 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ హనీ రోజ్. మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ వయ్యారి భామ ప్రేక్షకులను తన అందం అభినయంతో ఆకట్టుకుంది. ముద్దుగా బొద్దుగా చూడచక్కని రూపంతో ఆకట్టుకున్న ఈ భామ తన నటనతోనూ ఆకట్టుకుంది. వీరసింహారెడ్డి సినిమా సక్సెస్ అవడంతో ఈ భామకు వరుస ఆఫర్స్ క్యూ కడతాయని అంతా అనుకున్నారు. కానీ వీరసింహారెడ్డి తర్వాత ఆమె మరో తెలుగు సినిమా అనౌన్స్ చేయలేదు. బాలకృష్ణ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తోన్న భగవంత్ కేసరి సినిమాలో హనీ రోజ్ నటిస్తుందని వార్తలు వినిపించాయి. కానీ ఆమె ఈ సినిమాలో నటిస్తుందన్నదాని పై క్లారిటీ రాలేదు. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది హనీ రోజ్.

ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన అందాలతో నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది ఈ వయ్యారి. సినిమాలతో కంటే ఈ అమ్మడు షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తో బిజీ బిజీగా గడిపేస్తోంది హానీ రోజ్. నిత్యం తన గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ అమ్మడు వెకేషన్ లో ఉందని తెలుస్తోంది. అందమైన లొకేషన్స్ లో ఫోటోలు, వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. హనీ రోజ్ లేటెస్ట్ పోస్ట్ పై మీరూ ఓ లుక్కేయండి.

Follow Us