Viral Photo: పాలుకారే బుగ్గలున్న ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్.. మీరు కనిపెట్టారా..?

|

Jan 01, 2023 | 8:44 PM

టాలీవుడ్​కు మెగాహీరో నటించిన మూవీతో పరిచయమైంది. ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సరసన చాన్సులు కొట్టేసింది.

Viral Photo: పాలుకారే బుగ్గలున్న ఈ చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోయిన్.. మీరు కనిపెట్టారా..?
Heroine Childhood Photo
Follow us on

ఈ ఫొటోలోని క్యూటీ ఎవరో కనిపెట్టగలరా. తను ఇప్పుడు స్టార్ హీరోయిన్. సౌత్‌లో స్టార్ హీరోలు అందరితో నటించింది. అదేనండీ.. పొడుగు కాళ్ల సుందరి అంటారు. కుర్రాళ్లకు హాట్ ఫేవరెట్. ప్రజంట్ ఈమె డేట్స్ కోసం మేకర్స్ తెగ ఆరాటపడుతున్నారు. ఏంటి.. ఇప్పటికైనా గుర్తుపట్టారా..? అయ్యో లేదా.. ఆగండాగండి.. ఇంకో క్లూ ఇస్తాం.. ఈమె ఓ మెగాహీరో సినిమాతో తెలుగునాట ఎంట్రీ ఇచ్చింది. ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్ ఇలా మన స్టార్స్ అందరితో ఆడిపాడింది. ఐ థింక్ మీరు కనిపెట్టేసి ఉంటారు. ఇంకా ఆమె ఎవరో కనిపెట్టని వారికి డెడ్ ఈజీ క్లూ చెప్తున్నామ్. తనను ముద్దుగా బుట్టబొమ్మ, మేడమ్ అని పిలిచుకుంటారు. హా.. అవును.. ఈ ఫోటోలో ఉంది  చిన్నప్పటి పూజాహెగ్డే.

ప్రస్తుతం బాలీవుడ్​లోనూ స్టార్ హీరోల సరసన నటిస్తూ దూసుకుపోతుంది పూజా. సల్లూ భాయ్‌తో కలిసి కిసీ గా భాయ్ కిసీ గా జాన్ మూవీలో నటిస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. వీరు ప్రేమలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  సల్మాన్ ఖాన్ ప్రొడక్షన్​లో మరో రెండు సినిమాలకు కూడా ఓకే చెప్పిందట. పూజా ఫ్యాన్స్ మాత్రం ఇవన్నీ గాలి వార్తలని కొట్టిపారేస్తున్నారు.

ఇకపోతే  సినిమాల విషయానికొస్తే పూజా 2022లో రాధేశ్యామ్, బీస్ట్,​ ఆచార్య వంటి బడా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఇవేమీ కూడా పెద్దగా ఆడలేదు.   ఈ ముద్దుగుమ్మ ప్రజంట్ మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీలో నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి.