
విభిన్న కంటెంట్ చిత్రాలతో హీరోగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు అడివి శేష్. మేజర్, హిట్ 2 తర్వాత అతడు నటిస్తోన్న లేటేస్ట్ మూవీ డెకాయిట్. ఇది ఒక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ చిత్రం ఏప్రిల్ 10, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ఎస్ క్రియేషన్స్ , సునీల్ నారంగ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూర్చారు. తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో ఈ సినిమాను తెరకెక్కించగా.. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ , పాటలకు మంచి స్పందన లభించింది. కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్.
ఎక్కువమంది చదివినవి : Kichcha Sudeep: ఆర్జీవీ లేకపోతే నాకు సినిమా అవకాశాలు వచ్చేవే కాదు.. అసలు విషయం చెప్పిన కిచ్చా సుదీప్..
ఈ వేడుకకు వెంకటేశ్, సిద్దు జొన్నలగడ్డ, హీరో సుమంత్, రాహుల్ రవీంద్రన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే హీరో సుమంత్ మాట్లాడుతూ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కు క్షమాపణలు చెప్పారు. “క్షమించు.. మృణాల్ నీ రామ్ ను నీ దగ్గరి నుంచి తీసుకెళ్లిపోయినందుకు. నిజానికి సీతారామం సినిమాలో ఒక సీన్ ఉంది. కానీ ఎడిటింగ్ లో తప్పని పరిస్థితుల్లో అది తీసేయాల్సి వచ్చింది. దానికి కాంపన్సేషన్ గా నేను మా సిస్టర్ నిర్మాతలుగా నీకు డెకాయిట్ ఇచ్చాం. ఈ సినిమా కూడా నీకు మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుంది ” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సుమంత్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ఎక్కువమంది చదివినవి : Cinema OTT: దృశ్యం సినిమా కంటే 100 రెట్లు ఎక్కువ సస్పెన్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
గతంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ జంటగా నటించిన సినిమా సీతారామం. ఇందులో సుమంత్ ముఖ్య పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతోనే తెలుగులో మృణాల్ కు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక డెకాయిట్ కథ విషయానికి వస్తే.. ఇద్దరు మాజీ ప్రేమికులు కొన్ని దోపిడీల కోసం మళ్లీ ఎలా కలిశారు, వారి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి అనే అంశంపై ఈ సినిమా సాగుతుంది. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం వంటి అంశాలతో కూడిన ఇంటెన్స్ లవ్ స్టోరీ ఇది.
ఎక్కువమంది చదివినవి : Ram Gopal Varma : ఇండస్ట్రీలో గట్స్ ఉన్న హీరో అతనొక్కడే.. అందుకే ఆ రేంజ్లో ఉన్నాడు.. రామ్ గోపాల్ వర్మ..