Hamsanandini: క్యాన్సర్‏తో పోరాడుతూనే హీరోయిన్ ఫోటోషూట్.. బలం.. నమ్మకం.. అందమంటూ ప్రశంసలు..

|

Jan 22, 2022 | 10:00 AM

హంసానందిని.. తెలుగు చిత్రపరిశ్రమలో తన నటనతో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్. హంసానందినికి అందం, అభినయం

Hamsanandini: క్యాన్సర్‏తో పోరాడుతూనే హీరోయిన్ ఫోటోషూట్.. బలం.. నమ్మకం.. అందమంటూ ప్రశంసలు..
తాజాగా హంసానందిని ఫోటో షేర్ చేస్తూ ఆమె చాలా అందంగా కనబడుతున్నారని తెలిపింది. “మీ ఫోటో.. బలం, నమ్మకం, అందాన్ని ఆవిష్కరిస్తోంది. ఇప్పుడు క్యాన్సర్ తో మీరు చేస్తున్న యుద్ధం మీ జీవిత ప్రయాణంలో ఒక భాగం మాత్రమే అని అమీ పటేల్ పేర్కోన్నారు.
Follow us on

హంసానందిని.. తెలుగు చిత్రపరిశ్రమలో తన నటనతో ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న హీరోయిన్. హంసానందినికి అందం, అభినయం కలగలిపి ఉన్నప్పటికీ హీరోయిన్‏గా అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది. అయితే పలు చిత్రాల్లో కీలక పాత్రలలో.. స్పెషల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది హంసానందిని. అయితే గత కొద్ది రోజుల క్రితం నటి హంసానందిని బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. తాను గ్రేడ్ 3 క్యాన్సర్‏తో పోరాడుతున్నట్టు హంసానందిని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం ఆమెకు కీమోథెరపీ జరుగుతుంది.

ఇదిలా ఉంటే.. ఓవైపు చికిత్స తీసుకుంటునే ఫోటో షూట్ చేసింది హంసానందిని. గుండుతో ఉన్న ఈ ఫోటోలలో హంసానందిని ముఖంలో కొన్ని భావాలు కనిపించాయని ఆమెకు స్టైయిలిస్ట్‏గా చేసిన అమీ పటేల్ అన్నారు. తాజాగా హంసానందిని ఫోటో షేర్ చేస్తూ ఆమె చాలా అందంగా కనబడుతున్నారని తెలిపింది. “మీ ఫోటో.. బలం, నమ్మకం, అందాన్ని ఆవిష్కరిస్తోంది. ఇప్పుడు క్యాన్సర్ తో మీరు చేస్తున్న యుద్ధం మీ జీవిత ప్రయాణంలో ఒక భాగం మాత్రమే. మీరు దీన్నుంచి విజయవంతంగా.. మరింత అందంగా బయటకు వస్తారు. మేమంతా మీ వెంటే ఉంటాం ” అంటూ అమీ పటేల్ పేర్కోన్నారు.

18 ఏళ్ల క్రితం హంసానందిని తల్లి కూడా క్యాన్సర్‏తో మృతి చెందారు. ఆర్య రాజేష్ నటించిన అనుమానస్పదం సినిమాతో హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది హంసానందిని. తన జీవితంలో కాలం చూపే ప్రభావాలకు తాను బాధితురాలిగా ఉండాలనుకోవడం లేదంటూ తన బెస్ట్ క్యాన్సర్ విషయాన్ని గత డిసెంబర్ నెలలో బయటపెట్టింది హంసానందిని.

Also Read:  Varalxmi Sarathkumar: మరో క్రేజీ ఆఫర్ అందుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్.. పాన్ ఇండియా సినిమాలో జయమ్మ..

Malli Modalaindi: డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ అవ్వనున్న సుమంత్ ‘మళ్ళీ మొదలైంది’.. ఎప్పుడు.. ఎందులో అంటే..?

Mahesh Babu: మ‌హేష్‌ను సేవ‌ వైపు మ‌ళ్లించిది ఆ సంఘ‌ట‌నే.. బాల‌య్య షోలో సూప‌ర్ స్టార్‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.

RRR Movie Release Date: ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్‌డేట్‌.. సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించిన యూనిట్‌.. కానీ..