Viral Photo: కలువ కళ్ల చిన్నది ఇప్పుడు కుర్రాళ్ల దేవకన్య.. ఎవరో గుర్తుపట్టండి..

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న హీరోయిన్లలతో ఈ అమ్మడు స్థానం ప్రత్యేకం. అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులను కట్టి పడేసింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఎవరో గుర్తుపట్టండి.

Viral Photo: కలువ కళ్ల చిన్నది ఇప్పుడు కుర్రాళ్ల దేవకన్య.. ఎవరో గుర్తుపట్టండి..
Actress

Updated on: Aug 10, 2022 | 8:16 PM

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో యువతరం కథానాయికల హావా నడుస్తోంది. మొదటి సినిమాతోనే హిట్స్ అందుకుని ఇప్పుడు చిత్రపరిశ్రమలో రాణిస్తున్న యంగ్ హీరోయిన్స్ అనేక మంది ఉన్నారు. ఒక్క హిట్టుతో భారీగా క్రేజ్ సంపాందించుకోవడమే కాకుండా.. స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేస్తున్నారు. కృతి శెట్టి, నజ్రీయా నజీమ్, శ్రీలీల, రజీషా విజయన్ వంటి హీరోయిన్లు ఇప్పటికే తెలుగులో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇక తాజాగా మరో హీరోయిన్ టాలీవుడ్ ఆడియన్స్‏ను ఆకట్టుకుంది. తన నటనతో సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అనుకోకుండా వరించిన అవకాశంతో ఒక్కసారిగా ఫాలోయింగ్ పెంచుకుంది. తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న హీరోయిన్లలతో ఈ అమ్మడు స్థానం ప్రత్యేకం. అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులను కట్టి పడేసింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఎవరో గుర్తుపట్టండి.

కలువ కన్నులతోనే మాయ చేస్తున్న ఈ చిన్నది మరెవరో కాదు. అందాల సీతమ్మ మృణాల్ ఠాకూర్. డైరెక్టర్ హనురాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా నటనతో సీతగా ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ మూవీ ఆగస్ట్ 5న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.