రజినీకాంత్ సినిమాలో సైడ్ రోల్‌లో నటించిన ఈమెను గుర్తుపట్టారా..? ఇప్పుడు స్టార్ హీరోయిన్

ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా దాదాపు 700కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే రీసెంట్ గా లాల్ సలాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లాల్ సలాం సినిమాలు రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించారు.

రజినీకాంత్ సినిమాలో సైడ్ రోల్‌లో నటించిన ఈమెను గుర్తుపట్టారా..? ఇప్పుడు స్టార్ హీరోయిన్
Actress

Updated on: Mar 27, 2024 | 6:49 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమాలు నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్నా .. కలెక్షన్స్ మాత్రం బాగానే రాబడతాయి. ఇటీవలే సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. జైలర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడమే కాకుండా దాదాపు 700కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే రీసెంట్ గా లాల్ సలాం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లాల్ సలాం సినిమాలు రజినీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు రజినీకాంత్.కాగా రజిని నటించిన సినిమాల్లో లింగ సినిమా ఒకటి.

కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో విడుదలైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. 2014లో విడుదలైన ఈ సినిమాలో అనుష్క శెట్టి, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా హీరోయిన్స్ గా నటించారు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. కాగా ఈ సినిమాలో సోనాక్షి సిన్హా పక్కన నటించిన అమ్మడు గుర్తుందా..? పై ఫొటోలో కనిపిస్తుందే ఆమె.. ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.?

ఆ బ్యూటీ మరెవరో కాదు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అమృత అయ్యర్.. రామ్ హీరోగా నటించిన రెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది ఇటీవలే హనుమాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది. తేజ సజ్జ హీరోగా నటించిన హనుమాన్ సినిమా భారీ హిట్ అందుకోవడంతో పాటు.. 300కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హనుమాన్ సినిమా హిట్ అవ్వడంతో అమృత అయ్యర్ కు ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి.

 అమృత అయ్యర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.