Mahesh Babu: మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. అసలు ఊహించలేదుగా

|

Oct 20, 2024 | 7:04 PM

పై ఫొటోలో మహేష్ బాబుతో ఉన్న పాపను గుర్తు పట్టారా? ఇది బహుశా స్పైడర్ సినిమా మూవీ సెట్ లో తీసింది అనుకుంటా. అందులో ఈ పాప కూడా ఒక కీలక పాత్ర పోషించింది. అయితే ఆ తర్వాత చదువుల కోసం గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఎదుగుతోంది.

Mahesh Babu: మహేష్‌తో ఉన్న ఈ పాపను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. అసలు ఊహించలేదుగా
Mahesh Babu
Follow us on

పై ఫొటోలో సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన క్యూట్ స్మైల్ తో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ బ్యూటీ ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్. మొదట టిక్ టాక్ వీడియోలు, ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తో సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయిందీ ముద్దుగుమ్మ. అలాగే ఫ్యాషన్ బ్లాగర్ గానూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కొన్ని ప్రకటనల్లోనూ నటించింది. ఈ అమ్మడి క్యూట్ నెస్ కు ఫిదా అయిన దర్శక నిర్మాతలు తమ సినిమాల్లో ఛాన్స్ ఇచ్చారు. ఒక చిన్న సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇటీవల ఈ బ్యూటీ నటించిన ఒక సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో మరోసారి ఈ సొగసరి పేరు నెట్టింట మార్మోగిపోతోంది. ఇక మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మకు ఛాన్స్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ క్యూటీని గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. ఈ బ్యూటీ మరెవరో కాదు మన తెలుగమ్మాయి రమ్య పసుపులేటి. అదేనండి ఇటీవల సూపర్ హిట్ సినిమా మారుతినగర్ సుబ్రహ్మణ్యం లో హీరోయిన్ గా నటించిన అమ్మాయి.

రమ్య పసుపులేటి విషయానికి వస్తే చిన్నతనంలోనే యాడ్స్ లో నటించడం మొదలు పెట్టింది. ఇదే క్రమంలో అనుష్క నటించిన పంచాక్షరిలో బాల నటిగా నటించింది. అలాగే మహేష్ బాబు నటించిన స్పైడర్ మూవీలోనూ ఓ రోల్ పోషించింది. పై ఫొటో ఆ మూవీ సెట్ లో తీసుకున్నదేనేమో. అయితే ఉన్నత చదువులు అభ్యసించేందుకు మధ్యలో చాలా గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత హుషారు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సిరితో కలిసి బీఎఫ్ఎఫ్ అనే వెబ్ సిరీస్ లోనూ యాక్ట్ చేసింది. ఇక రీసెంట్ గా రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో కథానాయికగా నటించింది. ఇందులో రమ్య నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.

ఇవి కూడా చదవండి

మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమాలో రమ్య పసుపులేటి..

 

ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమాలో ఈ తెలుగమ్మాయికి కీ రోల్ దక్కిందని సమాచారం. అన్నట్లు సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది.

రమ్య లేటెస్ట్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.