Tollywood: ఊర మాస్ లుక్‌లో వివాదాల హీరో.. అసలు ఊహించలేదుగా.. ఎవరో గుర్తు పట్టారా?

సినిమాల కోసం తమను తాము మార్చుకునే నటీ నటులు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. జుట్టు, గడ్డాలు భారీగా పెంచుకోవడం, వర్కవుట్స్ చేసి బాడీ మెయింటైన్ చేయడం, సిక్స్ ప్యాక్ బాడీ.. ఇలా చాలా రకాలుగా తమ లుక్ ను మార్చేసుకుంటుంటారు.

Tollywood: ఊర మాస్ లుక్‌లో వివాదాల హీరో.. అసలు ఊహించలేదుగా.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actor
Follow us

|

Updated on: Oct 11, 2024 | 2:40 PM

సినిమాల కోసం తమను తాము మార్చుకునే నటీ నటులు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు. జుట్టు, గడ్డాలు భారీగా పెంచుకోవడం, వర్కవుట్స్ చేసి బాడీ మెయింటైన్ చేయడం, సిక్స్ ప్యాక్ బాడీ.. ఇలా చాలా రకాలుగా తమ లుక్ ను మార్చేసుకుంటుంటారు. ఇటీవల వచ్చిన శ్వాగ్ సినిమాలో విష్ణు ఏకంగా 5 విభిన్నమైన పాత్రల్లో కనిపించి ఆడియెన్స్ ను అలరించాడు. ఇప్పుడు మరో టాలీవుడ్ యంగ్ హీరో సరి కొత్త ఊర మాస్ లుక్ లో కనిపించి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు. పై ఫొటో అదే. మరి ఇందులో ఉన్నదెవరో గుర్తు పట్టారా? కెరీర్ ప్రారంభం నుంచి ప్రేమ కథలు, యూత్, రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ స్టోరీస్ తోనే సినిమాలు చేశాడీ హ్యాండ్సమ్ హీరో. మధ్యలో కొన్ని మాస్ సినిమాలు చేసినా లుక్ పరంగా ఎలాంటి ఛేంజ్ కనిపించలేదు. చూడ్డానికి సాఫ్ట్ గా, హ్యాండ్సమ్ కనిపించే ఈ హీరో ఇటీవల బాగా వార్తల్లో నిలిచాడు. సినిమాల పరంగా కంటే వ్యక్తిగత జీవితంతోనే అందరి నోళ్లల్లో నానాడు. మరి రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తోన్న ఈ యంగ్ అండ్ హ్యాండ్సమ్ హీరోను గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు ఇటీవల తన ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలిచిన నటుడు రాజ్ తరుణ్. ఇది అతని లేటెస్ట్ సినిమా రామ్ భజరంగ్ మూవీలోని లుక్.

‘రామ్ భజరంగ్’ సినిమాలో రాజ్ తరుణ్ తో మరో యంగ్ హీరో సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. సిమ్రత్ కౌర్, ఛాయా దేవి, మానస రాధాకృష్ణన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఊర మాస్ లుక్ లో రాజ్ తరుణ్..

రామ్ భజరంగ్ సినిమాలో రాజ్ తరుణ్, సందీప్ మాధవ్

ఈ పోస్టర్ లో రాజ్ తరుణ్ ర మాస్ లుక్ లో కనిపించాడు. డీ గ్లామర్ గా.. ముఖం నిండా గాట్లు.. ఉంగరాల జట్టు.. నోటిలో బీడితో వీర మాస్ లుక్ లో కనిపించాడు. ఇప్పటివరకు లవర్ బాయ్ లాగే కనిపించిన రాజ్ తరుణ్ ఇలా కనిపించేసరికి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.