11 October 2024

ఆ పని చేసి అమ్మకు అడ్డంగా దొరికిపోయా.. హీరోయిన్ రెజీనా..

Rajitha Chanti

Pic credit - Instagram

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ రెజీనాకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగుతోపాటు తమిళంలో ఎన్నో చిత్రాల్లో నటించింది. 

దాదాపు 17 ఏళ్లుగా సినీరంగంలో యాక్టింగ్ గా ఉంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం అవకాశాలు రావడం లేదు.

దీంతో ఇప్పుడిప్పుడే వెబ్ సిరీస్ చేస్తూ ఓటీటీ సినీ ప్రియులకు దగ్గరవుతుంది. తాజాగా నెట్టింట అభిమానులతో ఓ విషయం పంచుకుంది. 

తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన రెజీనాతన పర్సనల్ లైఫ్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంది. 

ఒక అభిమాని చెప్పకూడని ఏదైనా విషయం చేసి తల్లిదండ్రుల వద్ద దొరికిపోయారా అని ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పేసింది. 

తమ పక్కింట్లో ఏదో జరుగుతుందని.. అప్పుడు ఎవరికీ చెప్పకుండా ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నాని తెలిపింది రెజీనా. 

ఆ ఇంట్లోకి తొంగి చూస్తుండగా అమ్మ కంట్లో పడ్డానని.. దీంతో తనకు గట్టిగానే చివాట్లు పెట్టారని, ఆ ఆలోచన మంచిది కాదని తన తల్లి చెప్పిందట.

రెజీనా వయసు ప్రస్తుతం 33 ఏల్లు. ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిరల్.