Sharwanand : శర్వానంద్ గురించి చక్కర్లు కొడుతున్న వార్త.. అసలు విషయం ఏంటంటే..

|

Mar 11, 2022 | 8:17 AM

టాలీవుడ్ యంగ్ హీరోల్లో టాలెంటెడ్ హీరో శర్వానంద్. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుతున్నాడు శర్వా

Sharwanand : శర్వానంద్ గురించి చక్కర్లు కొడుతున్న వార్త.. అసలు విషయం ఏంటంటే..
Sharwanand
Follow us on

Sharwanand : టాలీవుడ్ యంగ్ హీరోల్లో టాలెంటెడ్ హీరో శర్వానంద్. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుతున్నాడు శర్వా. మొదటి నుంచి శర్వానంద్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమా చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. గత కొంత కాలంగా శర్వా నటించిన సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోతున్నాయి. శర్వా సాలిడ్ హిట్ అందుకొని చాలా కాలమే అయ్యింది.. అప్పుడప్పుడే మారుతి దర్శకత్వంలో వచ్చిన మహానుభావుడు సినిమాతో హిట్ అందుకున్న శర్వా.. ఆ తర్వాత ఆ స్థాయిలో విజయాన్ని తిరిగి అందుకోలేకపోయాడు. మళ్లీ ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడు శర్వా.. ఈ క్రమంలోనే ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను తిరుమల కిషోర్ ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాలో శర్వానంద్ కు జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించింది.

శర్వానంద్ చేయవలసిన ఒక మూడు పెద్ద సినిమాలు ఆయన చేజారి పోయినట్టుగా ఒక వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. శర్వానంద్ తన పారితోషికం విషయంలో ఎంతమాత్రం వెనక్కి తగ్గడంలేదని తెలుస్తుంది. పీపుల్ మీడియా.. యూవీ క్రియేషన్స్ వంటి పెద్ద బ్యానర్ల సినిమాలు ప్రస్తుత శర్వానంద్ చేతిలో ఉన్నాయి. మరి శర్వానంద్ పారితోషం గురించి వస్తున్న వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Andhra Pradesh: మాకు కొన్ని సినిమా టికెట్లివ్వండి.. మూవీ థియేటర్ యాజమాన్యాలను కోరిన విజయవాడ మేయర్..!

Shamna Kasim: అదిరే అందాలతో ఫిదా చేసిన పూర్ణ.. వావ్ అనాల్సిందే

Viral Photo: క్యూట్‏నెస్ ఓవర్‏లోడేడ్.. నవ్వుతోనే అట్రాక్ట్ చేస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. యూత్‏లో యమ క్రేజ్..