Yagnam Movie: తస్సాదియ్యా.. నెట్టింట సెగలు పుట్టిస్తోన్న ‘యజ్ఞం’ హీరోయిన్.. ఫోటోలతో రచ్చ చేస్తోందిగా..

|

Oct 14, 2024 | 1:09 PM

ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రంలో గోపిచంద్ యాక్టింగ్, డైరెక్టర్ రవికుమార్ చౌదరి టెకింగ్ పై సినీ క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. ఇక ఇందులో సమీరా బెనర్జీ కథానాయికగా నటించింది. యజ్ఞం సినిమాతోనే తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన సమీరా.. తొలి చిత్రానికే కథానాయికగా సక్సెస్ అయ్యింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపించలేదు.

Yagnam Movie: తస్సాదియ్యా.. నెట్టింట సెగలు పుట్టిస్తోన్న యజ్ఞం హీరోయిన్.. ఫోటోలతో రచ్చ చేస్తోందిగా..
Yagnam Movie
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ నుంచి హీరోగా మారి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు గోపిచంద్. జయం, నిజం, వర్షం వంటి చిత్రాల్లో పవర్ ఫుల్ విలన్ పాత్రలు పోషించిన ఈ హీరో.. ఆ తర్వాత కథానాయికుడిగా కనిపించి సక్సెస్ అయ్యాడు. గోపిచంద్ హీరోగా నటించిన సినిమా యజ్ఞం. 2004లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫ్యాక్షనిజం నేపథ్యంలో రూపొందించారు. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన మ్యూజిక్ హైలెట్ అయ్యిందనే చెప్పాలి. ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉన్నాయి. ఈ చిత్రంలో గోపిచంద్ యాక్టింగ్, డైరెక్టర్ రవికుమార్ చౌదరి టెకింగ్ పై సినీ క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. ఇక ఇందులో సమీరా బెనర్జీ కథానాయికగా నటించింది. యజ్ఞం సినిమాతోనే తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన సమీరా.. తొలి చిత్రానికే కథానాయికగా సక్సెస్ అయ్యింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో కనిపించలేదు.

యజ్ఞం సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తుందనుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరమయ్యింది. కొన్నాళ్లపాటు ఈ బ్యూటీ అడియన్స్ ముందుకు రాలేదు. దీంతో అసలు సమీరా ఎక్కడ ఉంది.. ? అసలేం చేస్తుంది అంటూ నెట్టింట ఆరా తీస్తున్నారు నెటిజన్స్. యజ్ఞం సినిమా తర్వాత సమీరాకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిన సమీరా.. అక్కడ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. ఆ తర్వాత బుల్లితెరకు షిఫ్ట్ అయ్యింది. అక్కడే వరుసగా సీరియల్స్ చేస్తూ టెలివిజన్ రంగంలో పాపులర్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

సమీరా బెనర్జీ.. కోలకత్తాకు చెందిన అమ్మాయి. 1997 నుంచి హిందీ సీరియల్స్ చేస్తున్న ఈ అమ్మడు.. యజ్ఞం సినిమాతోనే కథానాయికగా మారింది. ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేయలేదు. ఇప్పుడు హిందీలో దోరీ అనే సీరియల్ చేస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న సమీరా ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ లుక్ చూసి షాకవుతున్నారు నెటిజన్స్. యజ్ఞం సినిమాకు.. ఇప్పటికీ చాలా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.