దివంగత సీనియర్ హీరో కృష్ణ సినీ జీవితం ఆయన సోదరుడు ఆదిశేషగిరిరావు పాత్ర ఎంతో ముఖ్యమైనది. కృష్ణకు ప్రతి విషయంలో తోడుగా ఉంటూ వచ్చారు. హీరోగా.. నిర్మాతగా.. దర్శకుడిగా చిత్రపరిశ్రమలో అనేక మార్గాల్లో ముందుకు వెళ్లిన కృష్ణకు ప్రతి అడుగులో తోడున్నారు. తన అన్నయ్య సినిమాలకు సంబంధించిన విషయాలే కాకుండా ఆయన కుటుంబాన్ని కూడా ఆదిశేషగిరిరావు చూసుకునేవారు. అలాగే పద్మాలయ ప్రొడక్షన్ నిర్మాణ వ్యవహారాలు, స్టూడియో నిర్వహణ చూసుకునేవారు కూడా ఆయనే. ఇక కృష్ణ మరణం తర్వాత అంత్యక్రియలు.. చిన్న కర్మ అన్ని కార్యక్రమాలను ఆయనే దగ్గరుండి చూసుకున్నారు. కృష్ణ తర్వాత ఘట్టమనేని కుటుంబానికి ఆదిశేషగిరి రావు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గోని కృష్ణ ఫిల్మ్ కెరీర్.. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.
ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ.. ” నాకు మూడేళ్ల వయసు నుంచి అన్నయ్యతో జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. నా చిన్నప్పుడు సైకిల్ పై మా అన్నయ్య సినిమాలకు తీసుకుని వె ళ్లడం ఇంకా గుర్తుంది. మద్రాసులో ఆయన దగ్గరే ఉంటూ నేను చదువునేవాడిని. బంగారు అనేది ఆయన పెట్టిన పేరే. 70 లో ఆయన కుటుంబాన్ని నాకు అప్పగించారు. పిల్లలు ఏది కావాలన్న నన్నే అడిగేవారు. మా అన్నయ్య పడే కష్టం చూసి సినిమాల్లోకి వెళ్లాలని అనిపించలేదు.
కాలకాలం గుర్తుండిపోయేలా సినిమా చేద్దామని దేవుడు చేసిన మనుషులు సినిమా సమయంలోనే మా రాబోయే చిత్రం అల్లూరి సీతారామరాజు అని ప్రకటించాము. ఆ సినిమా నేను తీయను.. మీరు తీయోద్దు అని ఎన్టీఆర్ అన్నారు. వదిన ఇందిరమ్మ కన్నుమూసినప్పుడు అన్నయ్య ఎక్కువగా ఎమోషనల్ అయ్యారు ” అంటూ భావోద్వేగానికి గురయ్యారు ఆదిశేషగిరి రావు.