సినీపరిశ్రమలో విడాకులు చాలా ఎక్కువయ్యాయి. ఒకటి రెండు సంవత్సరాలు కాదు.. పాతికేళ్ల వైవాహిక బంధానికి ఇక స్వస్తి పలుకుతూ డివోర్స్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీలలోనూ విడిపోతున్న జంటలను చూస్తున్నాము. అయితే ఇండస్ట్రీలో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన విడాకులు ఎవరివో తెలుసా.. ? ఆ స్టార్ హీరో తన భార్య కోసం భారీగానే భరణం చెల్లించారట. ఆ జంట ఎవరో కాదు..బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఆయన మాజీ సతీమణి సుస్సానే ఖాన్. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలో హృతిక్ సుస్సానేని పెళ్లి చేసుకుని అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చాడు. వీరిద్దరికీ రెహాన్, రిధాన్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అయితే పెళ్లయిన 14 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పట్లో వీరిద్దరి డివోర్స్ గురించి పెద్ద చర్చే నడిచింది.
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ నివేదిక ప్రకారం.. బాలీవుడ్ ఇండస్ట్రీలో హృతిక్, సుస్సానే ఖాన్ ల విడాకులు చాలా ఖరీదైనవి. ఎందుకంటే హృతిక్ సుస్సానేకి భారీ మొత్తంలో భరణం చెల్లించాల్సి వచ్చింది. రూ. 400 కోట్ల భరణం ఇవ్వాలని సుస్సానే హృతిక్‌ను డిమాండ్ చేసింది. ఎట్టకేలకు ఎన్నో ప్రయత్నాల తర్వాత రూ.380 కోట్లు చెల్లించేందుకు అంగీకరించాడు హృతిక్. విడాకుల తర్వాత తమ పిల్లల కోసం అప్పుడప్పుడు కలుస్తున్నారు.
ఇదిలా ఉంటే.. విడాకుల తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న హృతిక్.. ప్రస్తుతం సింగర్ కమ్ నటి సబా ఆజాద్‌తో ప్రేమలో ఉన్నాడు. మరోవైపు సుస్సానే ఖాన్ ప్రముఖ టీవీ నటుడు అలీ గోని సోదరుడు అర్సలాన్ గోనితో డేటింగ్ చేస్తోంది. అయితే విడాకుల తర్వాత సుస్సానే, హృతిక్ ఇద్దరూ మంచి స్నేహితులుగా ఉంటారు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో చేసుకోవడం.. బర్త్ డేలకు విష్ చేసుకోవడం జరుగుతుంది.
ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..
Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?
Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‌తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.