చిక్కుల్లో కేజీఎఫ్ హీరో యశ్‌.. రౌడీలతో భయపెడుతున్నాడంటూ ఆరోపణ.!! కలెక్టర్‌కు ఫిర్యాదు.!

Actor Yash News: కేజీఎఫ్ ఫేం, కన్నడ స్టార్ హీరో యశ్ చిక్కుల్లో పడ్డారు. హాసన్ జిల్లా తిమ్మాపూర గ్రామంలో యశ్ 80 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు..

చిక్కుల్లో కేజీఎఫ్ హీరో యశ్‌.. రౌడీలతో భయపెడుతున్నాడంటూ ఆరోపణ.!! కలెక్టర్‌కు ఫిర్యాదు.!

Updated on: Mar 15, 2021 | 10:35 PM

Actor Yash News: కేజీఎఫ్ ఫేం, కన్నడ స్టార్ హీరో యశ్ చిక్కుల్లో పడ్డారు. హాసన్ జిల్లా తిమ్మాపూర గ్రామంలో యశ్ 80 ఎకరాల వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేశారు. ఈ భూమిలో అక్రమంగా ప్రహరీ గోడను నిర్మించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ రాజ్య రైతు సంఘం అధ్యక్షుడు అణ్ణాజప్ప హాసన్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రౌడీలను రప్పించి గ్రామస్తులను భయపడుతున్నారని.. రైతులకు న్యాయం జరిగేలా చూడాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాగా, ఇటీవల ఈ భూమి విషయమై గ్రామస్తులు, యశ్ తల్లిదండ్రులకు మధ్య గొడవ జరిగిన సంగతి తెలిసిందే. తమ పొలాలకు వెళ్లే దారిని మూసివేశారని గ్రామస్తులు యశ్ తల్లి పుష్పతల్లితో గొడవపడ్డారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివాన కావడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలకు సర్ది చెప్పారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులు ముఖ్య గమనిక…పలు ట్రైన్స్ దారి మళ్లింపు.. వివరాలివే!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ రోజే పెన్షన్ బెనిఫిట్స్.. వివరాలు ఇవే.!

చుట్టూ భారీ అనకొండలు.. వాటితో ఆటలు.. ఇంతలోనే ఊహించని సంఘటన.. గగుర్పొడిచే వీడియో.!

Follow Us