Rashmika Mandanna : పొలం బాట పట్టిన స్టార్ హీరోయిన్ .. హలం పట్టి పొలం దున్నిన కన్నడ సోయగం

|

Mar 18, 2021 | 6:25 PM

శాండల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్నా .. తక్కువ సమాయంలోనే స్టార్ హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా సినిమాలతో..

Rashmika Mandanna  : పొలం బాట పట్టిన స్టార్ హీరోయిన్ .. హలం పట్టి పొలం దున్నిన కన్నడ సోయగం
Rashmika Turns As A Farmer
Follow us on

Rashmika Mandanna As A Farmer:  శాండల్ వుడ్ బ్యూటీ రష్మిక మందన్నా .. తక్కువ సమాయంలోనే స్టార్ హీరోయిన్ గా ఫేమ్ సంపాదించుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా వేదికగా సినిమాలతో సహా అనేక విషయాలను పంచుకుంటుంది రష్మిక.

ఓ వైపు కన్నడ సినిమాతో మరో వైపు తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న కన్నడ సోయగం..ఇప్పుడిప్పుడే కోలీవుడ్, బాలీవుడ్ లో అడుగు పెడుతుంది. అవకాశాలను దక్కించుకుంటుంది.
తాజగా ఈ నటి అన్నదాత అవతారమెత్తింది. హలం పట్టి పొలం దున్నింది. ఆ వీడియో ను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
త‌మిళంలో కార్తీ హీరోగా వస్తున్న ‘సుల్తాన్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో పక్కా పల్లెటూరి యువతి పాత్రను పోషిస్తుంది రష్మిక. ఆ పాత్ర కోసం రష్మిక రైతుగా మారినట్లు తెలుస్తోంది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై య‌స్‌.ఆర్‌. ప్రకాష్ బాబు, య‌స్‌.ఆర్‌. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక అల్లు అర్జున్ నటిస్తున్న యాక్షన్ మరియు రొమాంటిక్ డ్రామా పుష్పాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఇది తెలుగు, తమిళం, మలయాళం, హిందీ , కన్నడ అనే ఐదు భాషలలో విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Also Read: ఓటర్లను ఆకట్టుకోవడానికి కమల్ కర్రసాము.. తండ్రి టాలెంట్‌కు కూతురు ఫిదా..!

సీఎం కేసీఆర్‌ను కలిసిన టీడీపీ ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.. అసెంబ్లీ హాల్‌లో అందరిచూపు అటు వైపే..!