పైన ఫోటోలో అభిమానితో అంత సరదాగా.. ఎంతో సింప్లిసిటితో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టరా ?.. తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తనే కన్నడ హీరోయిన్ రమ్య దివ్య స్పందన. దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన అభి సినిమాతో కన్నడ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది రమ్య. ఆ తర్వాత కుట్టు చిత్రంతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ హిట్ కావడంతో రమ్యకు అవకాశాలు క్యూకట్టాయి. కన్నడ, తమిళంలో వరుస చిత్రాలు చేసిన రమ్య.. తెలుగులోనూ నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అభిమన్యు మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యారు రమ్య. ఆ తర్వాత తమిళ్ స్టార్ సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాలోనూ నటించారు. ఈ రెండు చిత్రాల్లో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథానాయికగా రమ్య మొత్తం 20 సినిమాల్లో నటించింది. ఇక ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
ఇక ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ ఎంపీగా ప్రజలకు సేవ చేశారు. అయితే బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజీనామా చేశారు. అయితే ఇటు సినిమాలకు పూర్తిగా దూరమైన రమ్య.. చాలా కాలం రాజకీయాల్లో కొనసాగుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు. యాపిల్ బాక్స్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి కొత్త సినిమాలను నిర్మిస్తున్నారు. అయితే ఇటు నిర్మాతగానూ కొనసాగుతున్న రమ్య సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంటారు.
ఇదిలా ఉంటే.. తాజాగా రమ్య ఓ అభిమానితో ఫోటో దిగారు. ఆ సమయంలో అతడితో ఎంతో సరదాగా మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది. అభిమానులతో ఎంతో సింప్లిసిటిగా ముచ్చటిస్తున్న రమ్యను చూసి విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.