ఈ హాట్ బ్యూటీని గుర్తుపట్టారా..? ఒకేఒక్క సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచేసింది

|

Sep 03, 2024 | 11:11 AM

కొంతమంది మాత్రం ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు. పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా అంతే చేసింది తక్కువ సినిమాలే కానీ కుర్రాళ్లను విపరీతంగా ఆకట్టుకుంది. తన అందంతో కుర్రకారు మతిపోగొట్టింది. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది..

ఈ హాట్ బ్యూటీని గుర్తుపట్టారా..? ఒకేఒక్క సినిమాతో కుర్రాళ్ళ మనసు దోచేసింది
Actress
Follow us on

చాలా మంది హీరోయిన్స్‌కు అందం అభినయం ఉన్నా.. అదృష్టం లేక రాణించలేకపోతోన్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. కొంతమంది ఇండస్ట్రీలో సక్సెస్ కాలేక సినిమాలకు దూరం అయ్యారు. కొంతమంది మాత్రం ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తున్నారు. పైన కనిపిస్తున్న ముద్దుగుమ్మ కూడా అంతే చేసింది తక్కువ సినిమాలే కానీ కుర్రాళ్లను విపరీతంగా ఆకట్టుకుంది. తన అందంతో కుర్రకారు మతిపోగొట్టింది. మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు సక్సెస్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదట్లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. ఈ బ్యూటీ అందాలు తట్టుకోవడం కష్టమే మరి. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.?

పై ఫొటోలో మొఖం దాచేసుకున్న ఆ బ్యూటీ ఎవరో కాదు.. హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా.. 2021లో తెలుగులో వచ్చిన జాతిరత్నాలు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ పొడుగుకాళ్ల సుందరి. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది. అలాగే ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది. అఖిల్ హీరోగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ సినిమాలో చిన్న పాత్ర చేసింది. అలాగే నాగార్జున, నాగ చైతన్య బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది.

ఆతర్వాత లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. రవితేజ రావణాసుర, రీసెంట్ గా అల్లరి నరేష్ హీరోగా నటించిన ఆ ఒక్కటీ అడక్కు సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలు ఫరియా అబ్దుల్లా సక్సెస్ తెచ్చిపెట్టలేదు. ఇక ఇప్పుడు మత్తు వదలరా 2 సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా గ్లామరస్ గా కనిపించనుంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటుంది. ఈ మధ్యకాలంలో తన అందాలతో ఆకట్టుకుంటోంది ఈ బ్యూటీ. హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది ఈ అమ్మడు.

ఫరియా అబ్దుల్లా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

ఫరియా అబ్దుల్లా ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.