సిగ్గులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఆమె చాలా ఫెమస్ గురూ

పైన కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా ఆమె ఓ క్రేజీ హీరోయిన్ సినిమాలతో కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా సోషల్ మీడియాలో అవుతూ ఉంటుంది ఆ ముద్దుగుమ్మ.  హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది ఆమె.

సిగ్గులొలుకుతున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఆమె చాలా ఫెమస్ గురూ
Poonam Kaur

Updated on: Mar 30, 2024 | 6:49 PM

హీరోయిన్స్ కు సంబందించిన ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటోల వరకు నిత్యం పదుల సంఖ్యలో ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. పైన కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా ఆమె ఓ క్రేజీ హీరోయిన్ సినిమాలతో కంటే ఇతర విషయాలతోనే ఎక్కువగా సోషల్ మీడియాలో అవుతూ ఉంటుంది ఆ ముద్దుగుమ్మ.  హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సెకండ్ హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు సమాజంలో జరిగే సంఘటనలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తోంది ఆమె. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..? రెగ్యులర్ గా ఈ అమ్మడి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇంతకూ ఆమె ఎవరంటే..

పై ఫొటోలో సిగ్గులొలుకుతున్న ఆ చిన్నారి ఎవరో కాదు.. క్రేజీ బ్యూటీ పూనమ్ కౌర్. 2006లో వచ్చిన మాయాజాలం అనే సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం ఆయ్యింది పూనమ్ కౌర్. ఆతర్వాత వరుసగా సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అందం అభినయం ఉన్న ఈ చిన్నది శౌర్యం సినిమాలో గోపీచంద్ చెల్లెలిగా కనిపించి అలరించింది.

ఆతర్వాత చాలా సినిమాలో నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల్లోనూ నటించింది. ఇక 2018 తర్వాత ఈ చిన్నది సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సమాజంలో జరిగే సంఘటనలపై, మహిళల పై జరిగే అకృత్యాల పై స్పందిస్తూ ఉంటుంది పూనమ్ కౌర్. అలాగే సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది పూనమ్. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది పూనమ్ కౌర్.

పూనమ్ కౌర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

పూనమ్ కౌర్ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.