ఈ ఫొటోలో పుల్లలు ఏరుకుంటున్న అమ్మాయి.. ఇప్పుడు పిచ్చెక్కించే గ్లామర్ డాల్.. ఎవరో తెలుసా

|

Aug 01, 2024 | 10:27 AM

ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ ఫోటో వైరల్‌గా మారింది. అది ఆ హీరోయిన్ మొదటి సినిమాకు సంబందించిన ఫోటో. ఇప్పుడు ఆమె గ్లామర్ డాల్ గా మారిపోయింది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ నటి ఎవరు? ఆమె ఓల్డ్ ఫోటో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోంది.?

ఈ ఫొటోలో పుల్లలు ఏరుకుంటున్న అమ్మాయి.. ఇప్పుడు పిచ్చెక్కించే గ్లామర్ డాల్.. ఎవరో తెలుసా
Actress
Follow us on

స్టార్ హీరోయిన్స్  చిన్ననాటి ఫోటోలు తరచూ వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ఈ సెలబ్రిటీలు స్వయంగా తమ చైల్డ్ హుడ్ ఫోటోలను షేర్ చేస్తుంటారు. లేదంటే కొంతమంది అభిమానులు తమ ఫెవరెట్ హీరోయిన్స్ చిన్న నాటి ఫోటోలను వెతికి మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ స్టార్ హీరోయిన్ ఫోటో వైరల్‌గా మారింది. అది ఆ హీరోయిన్ మొదటి సినిమాకు సంబందించిన ఫోటో. ఇప్పుడు ఆమె గ్లామర్ డాల్ గా మారిపోయింది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ నటి ఎవరు? ఆమె ఓల్డ్ ఫోటో ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతోంది.?

ఈ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు అందాల నటి మృణాల్ ఠాకూర్. ఈరోజు (ఆగస్టు 1) ఈ అందాల భామ పుట్టినరోజు. అందరూ మృణాల్ ఠాకూర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  సోషల్ మీడియా వేదికగా మృణాల్ కు అభిమానులు, సెలబ్రెటీలు విషెస్ తెలుపుతున్నారు. ఇప్పుడు మృణాల్ ఓల్డ్ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. మృణాల్ సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పుడు ఎలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంది అని కొందరు పోల్చుకుంటున్నారు.

మృణాల్ ఠాకూర్ సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మృణాల్ ‘ముజ్సే కుచ్ కెహ్తీ యే కమోషియా’ సినిమాతో నటించడం ప్రారంభించింది. సీరియల్‌లో కీలక పాత్ర పోషించింది. సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టేనాటికి ఆమె వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే . ఆ తర్వాత 2014లో కొన్ని మరాఠీ సినిమాలు చేసింది. 2018లో విడుదలైన ‘లవ్ సోనియా’ చిత్రంలో మృణాల్ ప్రధాన పాత్రలో కనిపించింది. ఇది ఆమె మొదటి హిందీ సినిమా. అందులోని ఫోటోనే ఇప్పుడు వైరల్‌గా మారింది. పిల్లల స్మగ్లింగ్‌కు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. ఇందులో మృణాల్ బోల్డ్ సన్నివేశంలో కనిపించింది. ఆమె పాపులర్ అయ్యిన తర్వాత  తర్వాత ఈ సీన్ తొలగించారు. 2022లో విడుదలైన తెలుగు సినిమా ‘సీతా రామం’ మృణాల్ క్రేజ్ ను పెంచింది. ఈ సినిమాతో ఆమెకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత ఈ అమ్మడికి చాలా ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం మృణాల్ రెండు సినిమాల్లో నటిస్తోంది. మృణాల్ ఠాకూర్ తరచుగా బోల్డ్ ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..