Rebel Movie: ప్రభాస్ ‘రెబల్’ మూవీ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడెలా మారిపోయాడో చూస్తే షాక్ అవుతారు.. ఫొటోస్ వైరల్

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ఫుల్ యాక్షన్ సినిమాల్లో రెబెల్ ఒకటి. రాఘవ లారెన్స్ తెరకెక్కించిన ఈ చిత్రం థియేటర్లలో పెద్దగా ఆడలేదు. అయితే టీవీలో మాత్రం ఎగబడి చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రభాస్ అభిమానులకు ఈ మూవీ బాగానే నచ్చింది.

Rebel Movie: ప్రభాస్ రెబల్ మూవీ విలన్ గుర్తున్నాడా? ఇప్పుడెలా మారిపోయాడో చూస్తే షాక్ అవుతారు.. ఫొటోస్ వైరల్
Prabhas Rebel Movie

Updated on: Feb 13, 2026 | 9:37 PM

ప్రభాస్ నటించిన రెబల్ సినిమా సాధారణ జనాలకు నచ్చకపోవచ్చు.. కానీ.. డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీ అంటే పడి చస్తారు. మరీ ముఖ్యంగా ఇందులో ప్రభాస్ చేసిన ఫైట్స్ అయితే ఫ్యాన్స్ కు తెగ నచ్చేశాయి. ప్రీ ఇంటర్వెల్ ఫైట్, ఇంటర్వెల్ ఫైట్, టెంపుల్ ఫైట్, క్లైమాక్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే రెబల్ మూవీలో హై ఇచ్చే యాక్షన్ సీన్స్ చాలానే ఉన్నాయి. రాఘవ లారెన్స్ తెరకెక్కించిన హై ఓల్డేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 2012లో రిలీజై ప్లాఫ్ గా నిలిచింది. ఇందులో ప్రభాస్ పెద నాన్న, దివంగత నటుడు కృష్ణం రాజు కూడా ఓ కీలక పాత్రలో కనిపించారు. డార్లింగ్ సరసన తమన్నా భాటియా, దీక్షా సేథ్ యాక్ట్ చేశారు. ఇక ఈ మూవీలో విలన్ల సంఖ్య భారీగానే ఉంది. ముఖేష్ రుషి, కెల్లీ దోర్జీ, పరదీప్ రావత్, సుప్రిత్, తేజ్ సప్రు,కే.సీ. శంకర్.. ఇలా చాలా మందే విలన్లుగా మెప్పించారు. అయితే ఈ మూవీలో మొదటి నుంచి వినిపించే విలన్ పేరు స్టీఫెన్. ఈ పాత్రలో ప్రముఖ నటుడు కే.సీ. శంకర్ అదరగొట్టాడు. సిక్స్ ప్యాక్ బాడీతో స్టైలిష్ విలన్ గా మెప్పించాడు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ లో ప్రభాస్- కే.సీ. శంకర్ మధ్య వచ్చే ఫైట్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.

కేసీ శంకర్ గురించి తెలుగు ఆడియెన్స్ కు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ.. హిందీలో అతను తోపు యాక్టర్. ఎన్నో సినిమాలతో పాటు.. పలు వెబ్ సిరీస్‌లలో కూడా నటించాడు. సర్జమీన్, రాకేట్ బాయ్స్, రుద్ర, ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ తదితర సినిమాలు, సిరీస్ లు కేసీ శంకర్ కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఇక 2012లో రెబల్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఈ నటుడు.. చాలా గ్యాప్ తర్వాత నాగార్జున వైల్డ్ డాగ్ మూవీలో కనిపించాడు.

ప్రస్తుతం కే.సీ. శంకర్ హిందీ సినిమాలు, వెబ్ సిరీసుల్లో మాత్రమే నటిస్తున్నాడు. అయితే రెబల్ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన ఈ నటుడు ఇప్పుడు గుర్తు పట్టలేకుండా మారిపోయాడు. ప్రస్తుతం అతని ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

నటుడు కేసీ శంకర్ లేటెస్ట్ ఫొటోస్..

K. C. Shankar

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.