
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు తెలుగు, తమిళ్ లో సినిమాలు చేసి ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేసి అక్కడ సినిమాలు చేస్తుంటారు. కానీ అందరూ సక్సెస్ అవ్వలేరు.. చాలా మంది బాలీవుడ్ కు వెళ్లి అక్కడ నుంచి నటనకు గుడ్ బై చెప్పేశారు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. తెలుగులో తిరుగులేని హీరోయిన్ ఆమె.. ఎంతో మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. ఆ క్రేజ్ తోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఏకంగా రూ. 100కోట్ల సినిమా చేసి సక్సెస్ అందుకుంది. ఆతర్వాత కొంతమంది స్టార్స్ తో కలిసి నటించింది. కానీ అంతగా క్రేజ్ సొంతం చేసుకోలేకపోయింది. అదే టైంలో పెళ్లి చేసుకొని నటనకు గుడ్ బై చెప్పేసింది. ఇప్పుడు వందలకోట్లుకు మహారాణి ఆ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఆమె మరెవరో కాదు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఆసిన్.. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది ఈ అందాల తార. అలాగే తమిళ్ లో స్టార్ హీరోలు దళపతి విజయ్, సూర్య, విక్రమ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది ఆసిన్.
తమిళ్ లో ఆసిన్ నటించిన గజిని సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే సినిమా హిందీలోనూ రీమేక్ చేశారు. హిందీలో అమీర్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. అలాగే సల్మాన్ ఖాన్ నటించిన రెడీ సినిమాలోనూ నటించింది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకుందని ఆసిన్. మైక్రో మ్యాక్స్ సీఈవో రాహుల్ శర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది ఆసిన్. అసిన్ ఆస్తి విలుపు ప్రస్తుతం 1300 కోట్లకు పైగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి