AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్, పవన్, మంచు విష్ణులాంటి హీరోలతో చేసింది.. ఇప్పుడు ఆఫర్స్ లేక ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితం అవుతున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. కానీ ఆతర్వాత కనిపించకుండా పోతున్నారు ఈ ముద్దుగుమ్మలు. మరికొంతమంది టాలీవుడ్ లో సినిమాలు చేసి ఆతర్వాత బాలీవుడ్ కు చెక్కేస్తున్నారు. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ ఫోటో ఇప్పుడు నెటిజన్స్ ను అవాక్ అయ్యేలా చేస్తుంది.

మహేష్, పవన్, మంచు విష్ణులాంటి హీరోలతో చేసింది.. ఇప్పుడు ఆఫర్స్ లేక ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Jul 28, 2025 | 9:19 AM

Share

అదృష్టం ఎవరి తలుపు ఎప్పుడు తడుతుందో చెప్పడం కష్టం.. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో.. హీరోయిన్స్ గా రాణించాలని చాలా మంది ముద్దుగుమ్మలు ఎన్నో ఆశలతో  అడుగు పెడుతూ ఉంటారు. కానీ అందరూ సక్సెస్ కాలేరు. కొంతంమంది ముద్దుగుమ్మలు వరుసగా సినిమాలు చేసినప్పటికీ ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతుంటారు. ఆఫర్స్ రాక కొంతమంది సినిమాలకు దూరంగా ఉంటే మరికొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్తుంటారు. ఇక పై ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఒకప్పుడు ఇండస్ట్రీని ఊపేసింది. తన అందంతో అభినయంతో ప్రేక్షకులను ఉర్రుతలూగించింది. కానీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, మంచు విష్ణులాంటి హీరోలతో నటించి ఆకట్టుకున్న ఆ అమ్మడు ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది. ఇంతకూ ఆమె ఎవరంటే..

ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!

పవన్ కళ్యాణ్ జల్సా తో పేరు తెచ్చుకుంది ఆ భామ. ఆమె ఎవరో కాదు పార్వతీ మెల్టన్. పార్వతీ మెల్టన్ ఇప్పుడు ఎలా ఉంది.?ఏం చేస్తుంది.? అని నెటిజన్స్ గూగుల్ లో తెగ గాలించేస్తున్నారు. ఇంతకూ ఈ బ్యూటీ ఎలా ఉందో తెలుసా.? 2005లో వచ్చిన వెన్నెల అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఏ ముద్దుగుమ్మ. గేమ్, అల్లరే అల్లరి,మధుమాసం సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాలు ఏవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..

ఆతర్వాత జల్సా సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు హీరోగా నటించిన దూకుడు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. 2012లో వచ్చిన యమహో యమహ సినిమా తర్వాత ఈ అమ్మడు కనిపించలేదు. కాగా సినిమాలకు దూరంగా ఉంటున్న పార్వతి.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. కానీ ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చాలా మారిపోయింది. గుర్తుపట్టలేనంతగా చేంజ్ అయ్యింది. పార్వతి లేటెస్ట్ ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. చాలా మంది ఈ చిన్నది పార్వతీ మెల్టన్ అంటే నమ్మలేకపొతున్నారు.

ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

View this post on Instagram

A post shared by Parvati Melton (@parvatim)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..