AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా సాంగ్ అంటే.. 20ఏళ్ల అవుతున్నా ఇప్పటికీ అదే క్రేజ్.. యూట్యూబ్‌ను ఊపేస్తున్న పాట

కొన్ని సాంగ్స్ ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిరంగా ఉండిపోతాయి. వాటిలో ఈ సాంగ్ ఒకటి. ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని బ్లాక్ బస్టర్స్. ఒకదానిని మించి ఓ సాంగ్ ఉంటుంది. సినిమా వచ్చి 20ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ సాంగ్స్ క్రేజ్ తగ్గలేదు.

ఇది కదా సాంగ్ అంటే.. 20ఏళ్ల అవుతున్నా ఇప్పటికీ అదే క్రేజ్.. యూట్యూబ్‌ను ఊపేస్తున్న పాట
Movie Song
Rajeev Rayala
|

Updated on: Jun 18, 2026 | 10:22 AM

Share

సినిమాల రిజెల్ట్ ఎలా ఉన్నా సాంగ్స్ మాత్రం మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినా సాంగ్స్ మాత్రం విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటుంటాయి. సినిమాల విజయానికి సంగీతం ఎంత ప్లస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా సినిమాలు మ్యూజికల్ గా హిట్ అయ్యి ఇండస్ట్రీలో రికార్డ్ క్రియేట్ చేశాయి. కొన్ని సినిమాల్లో సాంగ్స్ అన్ని చార్ట్ బస్టర్ గా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సాంగ్ ఇండస్ట్రీని షేక్ చేసింది అంతే కాదు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని బ్లాక్ బస్టర్ అయ్యాయి. వాటిలో ఈ పాట ఆడియన్స్ ను స్టెప్పులేసేలా చేసింది. థియేటర్స్ లో ఈ పాటకు ఆడియన్స్ డాన్స్ లతో అదరగొట్టారు. ఆ సాంగ్ మరేదో కాదు..

ఇది కూడా చదవండి : తెలుగులో తిరుగులేని హీరోయిన్.. వెంకీ, బాలయ్య, నాగ్‌లతో నటించింది కానీ.. చిరంజీవితో ఒక్క సినిమా కూడా చేయలేదు

అల్లు అర్జున్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల్లో సాంగ్స్ కూడా అంతే వైబ్ గా ఉంటాయి. ఇక అల్లు అర్జున్ నటించిన సినిమాల్లో అండర్ రేటెడ్ మూవీగా నిలిచింది హ్యాపీ మూవీ. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మనదగ్గర యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. నిజానికి ఈ సినిమా చాలా మంది ఫేవరెట్ మూవీ. ఈ సినిమాలో కథ కథనం అంతా చాలా ఫ్రెష్ గా ఉంటుంది.

ఇది కూడా చదవండి : Bigg Boss 10: ఈసారి ఆట మాములుగా ఉండదు.. బిగ్ బాస్ హౌస్‌లోకి ఆ క్రేజీ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుందా.?

అలాగే ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని హిట్ అయ్యాయి. ముఖ్యంగా చిరుత కన్నుల వాడే అనే సాంగ్ సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఈ సాంగ్ లో అల్లు అర్జున్, జెనీలియా డాన్స్ తో ఆకట్టుకున్నారు. సాంగ్ కూడా అంతే వైబ్ తో ఉంటుంది. ఇటీవలే హ్యాపీ సినిమా మలయాళంలో రీ రిలీజ్ అయ్యింది. దాంతో థియేటర్స్ లో ఫ్యాన్స్ తెగ సందడి చేశారు. ముఖ్యంగా ఈ పాటకు ప్రేక్షకులు థియేటర్స్ లో డాన్స్ లతో రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతుంది. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్దామనుకున్నా.. అతనే నాకు తిరిగి ప్రాణం పోశారు

హ్యాపీ మూవీ సాంగ్ ఇక్కడ చూడండి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us