
టాలీవుడ్ లో డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు పూరిజగన్నాథ్. ఎంతమంది దర్శకులు ఉన్న పూరిజగన్నాథ్ స్టైల్, ఆయన సినిమా మేకింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన సినిమా తర్వాత హీరోల యాక్టింగ్ స్కిల్స్ లో చాలా చేంజెస్ వస్తాయి అంటున్నారు సినీ ప్రేక్షకులు. పూరీజన్నాథ్ సినిమా మేకింగ్ ప్రతిఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆయన సినిమాల్లో డైలాగ్స్, హీరోల క్యారెక్టరైజేషన్ యువతను విపరీతంగా ఆకట్టుకుంటాయి. పూరిజగన్నాథ్‌తో సినిమా చేయాలని చాలా మంది హీరోలు ఎదురుచూస్తూ ఉంటారు. పూరి కెరీర్ లో చాలా హిట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే.. ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం , అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి. లాంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.
అలాగే రవితేజతో కలిసి చేసిన ఇడియట్ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఇడియట్ మూవీ రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా యువతకు బాగా కనెక్ట్ అయ్యింది ఈ సినిమా. ఆ తర్వాత పూరి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆతర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి చేసిన పోకిరి సినిమా కూడా సంచలన విజయం సాధించింది.
మహేష్ కెరీర్ లో బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా.. ఆతర్వాత ఆయన చేసిన బిజినెస్ మ్యాన్, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు విపరీతంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు పూరి. డబుల్ ఇస్మార్ట్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే పూరిజగన్నాథ్ దర్శకత్వం చేయకముందు ఎం చేసేవారో తెలుసా..?
With the blessings of Lord Shiva 🔱
Ustaad @ramsayz & Dashing Director #PuriJagannadh‘s#DoubleISMART Pooja ceremony commenced 🪔
Shoot Begins on July 12th❤️🔥
Mass Action Entertainer at the cinemas on MARCH 8th, 2024💥@Charmmeofficial @IamVishuReddy pic.twitter.com/Kj9vDRHiIg
— Puri Connects (@PuriConnects) July 10, 2023
దర్శకత్వంలోకి రాక ముందు పూరి సినిమా కథలను రాసి దర్శకులకు ఇచ్చే వారట. అలా చాలా మందికి కథలు రాశారట. అలా కథలు రాయడంతో..వంద రూపాయల నుంచి వేయి రూపాయల వరకు రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నారట పూరి. అంతే కాదు కథకు తగ్గట్టుగా షార్ట్ ఏనిమేషన్ బొమ్మలు కూడా గీసేవారట. ఇందుకు గాను వారానికి 50 రూపాయిలు అందుకునేవారట పూరిజగన్నాథ్. ఈ విషయాలన్నీ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు పూరి.
Boss #PuriJagannadh from sets of #DoubleISMART shoot in Thailand 💥
IN CINEMAS MARCH 8th, 2024❤️🔥
Ustaad @ramsayz @duttsanjay @Charmmeofficial @IamVishuReddy @PuriConnects pic.twitter.com/tTkbtd04qF
— Puri Connects (@PuriConnects) August 15, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..