Ram Charan: అమ్మబాబోయ్..! రామ్ చరణ్ సిస్టర్ దుమ్మురేపిందిగా.. ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే

|

Aug 26, 2024 | 7:42 PM

శంకర్ ఇటీవలే భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా ఎక్కువ ఫోకస్ పెట్టాడు శంకర్. చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది.

Ram Charan: అమ్మబాబోయ్..! రామ్ చరణ్ సిస్టర్ దుమ్మురేపిందిగా.. ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగరాల్సిందే
Govindudu Andarivadele
Follow us on

రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ ఛేంజర్  సినిమాతో బిజీగా ఉన్నాడు. టాప్ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచానాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ చాలా కాలంగా జరుగుతోంది. శంకర్ ఇటీవలే భారతీయుడు 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దాంతో ఇప్పుడు గేమ్ ఛేంజర్ సినిమా ఎక్కువ ఫోకస్ పెట్టాడు శంకర్. చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడని తెలుస్తోంది. ఒకొక్క సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ నటుడిగా ఒకొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాడు మెగా పవర్ స్టార్.

ఇది కూడా చదవండి : ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరో భార్య..

శంకర్ సినిమాతో పాటు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన సినిమాల్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గోవిందుడు అందరివాడేలే సినిమా ఒకటి.క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాను కృష్ణవంశీ తన మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కించి విజయం అందుకున్నారు. ఈ మూవీలో చరణ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటించింది. ఇక ఈ సినిమాలో చరణ్ చెల్లెలి పాత్రలో నటించిన అమ్మడు గుర్తుందా.? ఆమె ఎవరు.? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఇది కూడా చదవండి :Vikramarkudu: విక్రమార్కుడు “టెన్నిసు బంతుల పాప” ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?

ఆ సి చిన్నదాని పేరు అయేషా కాదుస్కర్. గోవిందుడు అందరివాడేలే సినిమాలో కనిపించింది కొంతసేపు అయినా తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ చిన్నది. అయితే చూడటానికి అచ్చం తెలుగమ్మాయిలా ఉంటుంది కానీ ఆమె ముంబైకి చెందిన నటి. చాలా సినిమాల్లో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేసింది. హృతిక్ రోషన్ నటించిన అగ్నిపథ్ సినిమాలో నటించింది. ఆతర్వాత గోవిందుడు అందరివాడేలే సినిమలో చేసింది. గోవిందుడు అందరివాడేలే సినిమా తర్వాత మరో తెలుగు సినిమాలో చేయలేదు ఈ చిన్నది. కానీ బాలీవుడ్ లో మాత్రం సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఆయుష్మాన్ ఖురానా నటించిన డాక్టర్ జీ అనే సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది యమా యాక్టివ్ గా ఉంటుంది. రోజు రకరకాల ఫోటోలను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటోంది అయేషా. ఈ క్రమంలోనే ఈచిన్నదాని కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ అమ్మడి ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.