RGV : సినిమా చండాలంగా ఉంది.. కుదిరితే ఆపేయ్యమని చెప్పారు.. కానీ.. ఇండస్ట్రీని షేక్ చేసింది.. రామ్ గోపాల్ వర్మ..

రామ్ గోపాల్ వర్మ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక విలక్షణమైన, సంచలనాత్మక దర్శకుడు. ఆయన మొదటి సినిమా 'శివ' (1989) తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో నాగార్జున వాడిన సైకిల్ చైన్ సీన్ ఇప్పటికీ ఒక ఐకానిక్ మూమెంట్‌గా నిలిచిపోయింది. బాలీవుడ్ అండర్ వరల్డ్ నేపథ్యంతో ఆయన తీసిన 'సత్య', 'కంపెనీ', 'డి' వంటి సినిమాలు 'ముంబై నోయిర్' అనే ఒక కొత్త తరహా జానర్‌ను ప్రాచుర్యంలోకి తెచ్చాయి.

RGV : సినిమా చండాలంగా ఉంది.. కుదిరితే ఆపేయ్యమని చెప్పారు.. కానీ.. ఇండస్ట్రీని షేక్ చేసింది..  రామ్ గోపాల్ వర్మ..
Ram Gopal Varma

Updated on: Apr 01, 2026 | 9:49 PM

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రం నిర్మాణం వెనుక అనేక ఆసక్తికర విషయాలు, సవాళ్లని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వర్మ బౌండెడ్ స్క్రిప్ట్‌ను ఉపయోగించకుండా, కేవలం షాట్ డివిజన్‌లతో సీక్వెన్స్‌లను వివరించి నిర్మాతలైన అక్కినేని వెంకట్, యార్లగడ్డ సురేంద్రలను ఒప్పించారు. వర్మ తన మనసులో సినిమా మొత్తం చూసుకున్నానని, టెక్నీషియన్లు గందరగోళంలో ఉన్నా తనకు స్పష్టత ఉందని చెప్పారు. సినిమా చివరి దశకు వచ్చేసరికి నిర్మాతలైన వెంకట్, సురేంద్రలకు చిత్రంపై నమ్మకం సన్నగిల్లిందని.. డబుల్ పాజిటివ్ షో చూసిన తర్వాత సురేంద్ర స్నేహితుడు సినిమా “చండాలంగా ఉంది, విడుదల ఆపేయండి” అని చెప్పారని గుర్తుచేసుకున్నారు.

మరో మేనేజర్ “బాటనీ పాఠముంది పాట చండాలంగా ఉంది, సినిమా యావరేజ్” అని అన్నారని.. ఈ ప్రతికూల స్పందనల మధ్య, ఇళయరాజా కూడా డబుల్ పాజిటివ్ చూసి, “సైలెంట్ సినిమా చూసినట్టుంది” అని చెప్పారని గుర్తుచేసుకున్నారు ఆర్జీవీ. తర్వాత సురేంద్ర వెళ్లి కలిసినప్పుడు, ఇళయరాజా చిత్రం ఫ్లాట్‌గా ఉందని, కామెడీ ట్రాక్ పెట్టాలని సూచించారు. అయితే, రామ్ గోపాల్ వర్మ కామెడీ ట్రాక్ ఈ సినిమాకు పనికిరాదని తిరస్కరించారు. ఇలాంటి గడ్డు పరిస్థితులలో, అక్కినేని నాగార్జున రామ్ గోపాల్ వర్మపై అచంచలమైన నమ్మకాన్ని పెట్టుకున్నారని తెలిపారు.

సినిమా సంగీతం, సౌండ్ విషయంలో రాజీ పడకూడదని, అవసరమైతే తన రెమ్యునరేషన్ నుండి డబ్బులు కట్ చేసుకోమని నిర్మాతలైన వెంకట్‌, సురేంద్రలకు సూచించారు. నాగార్జున మద్దతు లేకుంటే, బహుశా శివకు ట్రాక్ మ్యూజిక్ (రికార్డ్ చేయబడిన సంగీతం) వినియోగించేవారని, అలా జరిగి ఉంటే సినిమా ఫలితం వేరేలా ఉండేదని వర్మ అభిప్రాయపడ్డారు. ఇళయరాజా అసలు సంగీతం లేకుండా శివ చిత్రం అసంపూర్ణమని వర్మ బలంగా నమ్ముతారు. శివ చిత్రానికి వినూత్నమైన సౌండ్ డిజైన్ ఒక ప్రత్యేక ఆకర్షణ. వర్మ సింధూరపువ్వు చిత్రంలోని పంచ్ సౌండ్స్ నుండి ప్రేరణ పొంది, దీపన్ ఛటర్జీని (షోలే రీ-రికార్డింగ్ మిక్సింగ్‌లో పనిచేశారు) నియమించారు. శివ కోసం కారు గొంతులో పడినప్పుడు వచ్చే శబ్దాల వంటివాటిని లైవ్‌గా రికార్డ్ చేయడం అప్పట్లో ఒక కొత్త ప్రయోగం. సినిమాకు ఇది ఒక సరికొత్త అనుభూతినిచ్చింది.

రామ్ గోపాల్ వర్మ తన చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తాను చూసిన ఇతర చిత్రాల నుండి ప్రేరణ పొంది, వాటిని తనదైన శైలిలో అనుసరించారని ఒప్పుకున్నారు. ఉదాహరణకు, ఒక వెస్ట్రన్ చిత్రం ఫైవ్ మెన్ ఆర్మీ నుండి ఒక ఛేజింగ్ సీక్వెన్స్, బాలూ మహేంద్ర వసంత కోకిల (శ్రీదేవి, కమల్ హాసన్ నటించినది) చిత్రం నుండి ఒక స్తంభాన్ని ఢీకొనే సన్నివేశం స్ఫూర్తి పొందారు. అయితే, ఒక సన్నివేశంలో వచ్చే పెద్ద నీడ మాత్రం తాము లైటింగ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా పుట్టిన ఆలోచన అని వర్మ వివరించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : రూ.9 కోట్లతో తీస్తే రూ.75 కోట్ల కలెక్షన్స్.. థియేటర్లను షేక్ చేసిన తమిళ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి..

Follow Us