AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli: అభిమానిపై కోప్పడ్డ రాజమౌళి.. జక్కన్న చేసింది కరెక్ట్ అంటున్న నెటిజన్స్

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు. మహేష్ బాబు, రాజమౌళి సినిమా పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తుంది. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ కూడా నటిస్తున్నారు.

Rajamouli: అభిమానిపై కోప్పడ్డ రాజమౌళి.. జక్కన్న చేసింది కరెక్ట్ అంటున్న నెటిజన్స్
Rajamouli
Rajeev Rayala
|

Updated on: Jul 14, 2025 | 9:15 AM

Share

దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పాన్ గ్లోబల్ రెంజ్ తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఇదిలా ఉంటే.. ఎస్.ఎస్. రాజమౌళి ఒక అభిమానిపై కోప్పడిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ సంఘటన 2025 జూలై 13న హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు నివాసంలో జరిగింది. ప్రముఖ నటుడు కోట శ్రీనివాస్ రావు ఇటీవల కన్ను మూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఆదివారం కన్నుమూశారు. కోటశ్రీనివాస్ భౌతికకాయానికి సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.

ఇది కూడా చదవండి : మా అమ్మ వద్దన్నా అతన్ని పెళ్లి చేసుకొని తప్పు చేశా..! టాలీవుడ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

సినీ ప్రముఖులతో పాటు కోట శ్రీనివాసరావు మరణంతో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు రాజమౌళి, ఆయన భార్య రమాతో కలిసి వచ్చారు. నివాళులు అర్పించిన తర్వాత తిరిగి వెళ్తుండగా, ఒక అభిమాని సెల్ఫీ కోసం రాజమౌళిని వెంబడించాడు. రాజమౌళి వెంటపడుతూ.. కారు వద్దకు వచ్చే వరకూ ఇబ్బంది పెట్టాడు. ముందు ఓపికకాగా ఉన్న రాజమౌళి.. ఆతర్వాత అభిమాని అత్యుత్సహంతో మీద పడటంతో కోప్పడ్డారు. సెల్ఫీ కోసం పట్టుబట్టడంతో రాజమౌళి అసహనం వ్యక్తం చేసి, ఆ అభిమానిని పక్కకు నెట్టారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : Prabhas : ఆయన అలా అనగానే నాకు ఫస్ట్ టైమ్ కన్నీళ్లు వచ్చాయి.. జీవితంలో మర్చిపోలేనన్న ప్రభాస్

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది, దీనిపై నెటిజన్లు రాజమౌళి అసహనాన్ని సమర్థిస్తూ, అటువంటి సందర్భంలో సెల్ఫీ కోసం ఇబ్బంది పెట్టడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు. సమయం, సందర్భం లేకుండా కొంతమంది సెల్ఫీలు అంటూ ఇలా చేయడం కరెక్ట్ కాదు అని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.  ఇక రాజమౌళి , మహేష్ బాబు సినిమా విషయానికొస్తే.. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.

ఇది కూడా చదవండి : అప్పుడు స్టార్ హీరోలతో చేశా.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు.. చైల్డ్ ఆర్టిస్ట్ ఆవేదన

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బెండకాయలు తింటే నిజంగా లెక్కలు బాగా వస్తాయా?
బెండకాయలు తింటే నిజంగా లెక్కలు బాగా వస్తాయా?
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
అమెరికాలో ఏం జరిగింది? 13 రోజులుగా వీడని శ్రీజ మిస్సింగ్ మిస్టరీ
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
ఏలూరు పంట పొలాల్లో అరుదైన పక్షుల సందడి!
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
మర్యాద రామన్నలో నటించిన ఈ కుర్రాడిని గుర్తుపట్టారా?
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
19 ఏళ్లకే OYO ప్రారంభం.. నేడు వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి!
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
మీ విజయ రహస్యం ఎవరికీ చెప్పకండి..ఈ కథ తెలిస్తే మీ ఆలోచన మారుతుంది
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
ఎంత ముదురు మటన్‌ అయినా.. ఇవి వేస్తే నిమిషాల్లోనే ముక్క మెత్తగా..
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
రోజ్ వాటర్‌తో ముఖం కాంతివంతంగా మారుతుందా? అసలు నిజం ఇదే!
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
కోటీశ్వరుల సంబంధాలన్నింటినీ వద్దని అసిస్టెంట్ డైరెక్టర్‌‌ను..
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి
దొండకాయ తినని వారు కూడా లొట్టలేసుకుని తింటారు.. ఇలా పచ్చడి చేయండి