Tammareddy Bhardwaj: లైగర్ వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ.. అది పూరీ బాధ్యత కాదంటూ..

|

Oct 26, 2022 | 1:44 PM

లైగర్ విషయంలో పూరీ మాటల్లో ధర్మం ఉందని.. తన సినిమా కొనుగోలు చేయాలని అడగలేదని.. న్యాయంగా మాట్లాడుకుంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత పూరీకి లేదని

Tammareddy Bhardwaj: లైగర్ వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ.. అది పూరీ బాధ్యత కాదంటూ..
Thammareddy Bhardwaj
Follow us on

లైగర్ సినిమా విషయంలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‏కు.. ఆమూవీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు మధ్య వివాదం నెలకొందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ వార్తలపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. లైగర్ విషయంలో పూరీ మాటల్లో ధర్మం ఉందని.. తన సినిమా కొనుగోలు చేయాలని అడగలేదని.. న్యాయంగా మాట్లాడుకుంటే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు డబ్బులు చెల్లించాల్సిన బాధ్యత పూరీకి లేదని అన్నారు. గతంలోనూ పూరీ తెరకెక్కించిన నేనింతే సినిమాకు కూడా ఇలాంటి సంఘటనలే జరిగాయన్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ” పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన నేనింతే చిత్రం విడుదలైనప్పుడు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇలాగే ధర్నాకు దిగారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ వివాదం సద్దుమణిగింది. ఇక లైగర్ విషయానికి వస్తే.. పూరీ మాటల్లో ధర్మం ఉంది. ఆయన ఎవరి వద్దకు వెళ్లి సినిమాకు కొనుగోలు చేయాలని అడగలేదు. ఆ హీరో గత సినిమాలు ఎంత మొత్తంలో వసూళ్లు రాబట్టాయో అంచనా వేసుకుని.. సినిమాను కొనుగోలు చేయాలి.

ఇవి కూడా చదవండి

అంతేకానీ.. ఎక్కువ రేటు పెట్టి సినిమాను కొనుగోలు చేసి వాళ్లు తప్పు చేశారు. న్యాయంగా మాట్లాడుకుంటే పూరీ ఒక్క సినిమాతో మార్కెట్లోకి వచ్చాడు. ఒక ధర చెప్పి.. దాన్ని మొత్తానికే అమ్ముతానని అన్నాడు. ఆయన చెప్పిన ధరకు ఇష్టపడే కొనుగోలు చేశారు.. ఇప్పుడు మేము నష్టపోయాం, తిరిగి మా డబ్బులు మాకివ్వండి అని అడగడం ఎందుకు ?.. అంత మొత్తంలో సినిమాను కొనుగోలు చేసేటప్పుడే ఆలోచించాలి ..రిస్క్ చేయాలని వెళ్లినప్పుడు రిస్క్ చేయాలని.. కానీ రిస్క్ చేయమని అన్నప్పుడు మళ్లీ రికవరి డబ్బులు అడగడమేందుకు ” అని అన్నారు.