Priyadarshi: ‘ఆడిషన్స్‏కు వెళ్తే నల్లగా.. సన్నగా ఉన్నావ్ అంటూ అవమానించారు’.. కమెడియన్ ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

Oct 26, 2022 | 11:23 AM

పెళ్లి చూపులు సినిమాలో ప్రియదర్శి చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ తో అతడి క్రేజ్ మారిపోయింది. ఆ సినిమాలో నా చావు నేను చస్తా అనే పుస్తకం రాస్తున్నా అంటూ ప్రియదర్శి చెప్పిన డైలాగ్

Priyadarshi: ఆడిషన్స్‏కు వెళ్తే నల్లగా.. సన్నగా ఉన్నావ్ అంటూ అవమానించారు.. కమెడియన్ ప్రియదర్శి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Priyadarshi
Follow us on

తెలుగు చిత్రపరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్..పంచులు..ప్రాసలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కమెడియన్ ప్రియదర్శి. పెళ్లి చూపులు సినిమాలో చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ అతడి క్రేజ్ మారిపోయింది. ఆ సినిమాలో నా చావు నేను చస్తా అనే పుస్తకం రాస్తున్నా అంటూ ప్రియదర్శి చెప్పిన డైలాగ్ యూత్‏ను ఆకట్టుకుంది. ఈ మూవీ తర్వాత అర్జున్ రెడ్డి, జై లవకుశ, జాతి రత్నాలు, రాధేశ్యామ్, సీతారామం వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆ తర్వాత ఆయన ప్రధాన పాత్రలో నటించిన మల్లేశం సినిమాకు ప్రేక్షకుల నుంచే కాదు.. సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ సినిమా తర్వాతే చాలా మంది చేనేత కుటుంబాల గురించి తెలుసుకున్నానని.. అందులోని పాత్రను చూసి చాలా మంది ప్రశంసించారని ప్రియదర్శి చెప్పుకొచ్చారు. ఇక ఇటీవల యంగ్ అండ్ టాలెంట్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఒకే ఒక జీవితం సినిమాలో కనిపించారు. ఈ క్రమంలోనే తాజాగా చెప్పాలని ఉంది కార్యక్రమంలో తన కెరీర్ లో ఎదురైన సంఘటనలు.. సినిమాల గురించి ఆసక్తికర విషాయలను పంచుకున్నారు.

ప్రియదర్శి మాట్లాడుతూ.. ముందుగా తాను సినిమాల్లోకి వెళతాను అంటే ఇంట్లో వాళ్లు అంగీకరించలేదని.. అందకే కెమెరా వర్క్ నేర్చుకుంటాను .. సినిమాటోగ్రాఫర్ గా అవకాశాలు వస్తాయని ఇంట్లో చెప్పి.. ఎలా అయినా ఇండస్ట్రీలోకి రావాలనుకున్నట్లు తెలిపాడు. 2014లో శ్రీకాంత్ హీరోగా నటించి టెర్రర్ సినిమాలోని పాత్రల కోసం ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి వెళ్లాను. వాళ్లు మొదట నన్ను తీసుకోలేదు. కానీ తర్వాత ఆ పాత్రకు నేనే సరిపోతాననిపించి నన్ను పిలిచారు అంటూ చెప్పుకొచ్చారు.

తన జీవితంలో చాలాసార్లు అవమానాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఆడిషన్స్‏కు వెళ్లినప్పుడు నల్లగా.. సన్నగా ఉన్నాడని.. మొటిమలు ఎక్కువగా ఉన్నాయని.. హీరో కంటే పొడుగ్గా ఉన్నాడు అనే వాళ్లు అని.. అలా అన్నప్పుడల్లా నన్ను నేను ప్రొత్సహించుకునే వాడినని అన్నారు. అలాగే తనకు కొమురం భీం బయోపిక్ చేయాలని ఉందని. కాళోజీ జీవిత చరిత్ర కూడా చేయాలని ఉంది.. అలాగే రామోజీ రావు జీవిత చరిత్ర సినిమాగా తీస్తే అందులో నటించాలని ఉందని తెలిపారు. శాంతా బయోటిక్ వరప్రసాద్ బయోపిక్ చేయాలని ఉంది.. వీరి జీవితచరిత్రలలో ఎవరు నటించినా చూసి సంతోషిస్తానని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.