
బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ మరణవార్త సినీ పరిశ్రమను ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. దశాబ్దాలుగా చలన చిత్ర పరిశ్రమను ఏలిన లెజెండ్ కన్నుమూయడంతో.. ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ దిగ్గజ నటులలో ఒకరైన దిలీప్ కుమార్.. తన నటనతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న ఆయన.. ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్కు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జూనియర్ ఎన్టీఆర్.. దిలీప్ కుమార్కు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.
భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక యుగం ముగిసింది అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.. బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ను అరుదైన ఫోటను షేర్ చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ ట్వీట్ చేశారు. “భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక యుగం ముగిసింది. భారతీయ చిత్రపరిశ్రమలో గొప్ప నటులలో దిలీప్ కుమార్ ఒకరు. దశాబ్ధలుగా ప్రపంచాన్ని మంత్రిముగ్దులను చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను ” అంటూ ట్వీట్ చేశారు.
ట్వీట్..
ప్రకాష్ రాజ్ ట్వీట్..
జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్..
వెంకటేశ్ ట్వీట్..
కళ్యాణ్ రామ్..
Dilip Kumar Death: సినీ దిగ్గజం దిలీప్ కుమార్కు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ అశ్రు నివాళి..