ఫ్యూచర్ వైపు పరుగులెత్తండి తప్పులేదు. కానీ.. ఫ్లాష్‌బ్యాక్‌ని మాత్రం మర్చిపోకండి.. అంటున్నారు ప్రొడ్యూసర్ దిల్‌రాజు. ప్రజంట్ స్టార్ డైరెక్టర్ల మైండ్ సెట్ గురించి మాట్లాడుతూ ఆయనిచ్చిన స్టేట్‌మెంట్ ఇప్పుడు ఇండస్ట్రీని ఆలోచింపజేస్తోంది.
అవును… చిన్న సినిమాల వైపు పెద్ద డైరెక్టర్లు ఎందుకు చూడ్డం లేదు..? రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, కోడిరామక్రిష్ణ లాంటి ఫేమస్ డైరెక్టర్లు.. చిన్నాపెద్దా అన్నీ కలిపి చేసినందుకే సెంచరీ కొట్టగలిగారు. మరి.. ఆ సెంచరీలు మీకొద్దా అనేది దిల్‌రాజు అడుగుతున్న ప్రశ్న. జస్ట్ థింక్ ఎబౌట్ ఇట్…!
బట్.. ఒక్కసారి స్టార్ స్టేటస్ వచ్చాక.. డైరెక్టర్లు బిజీ అవుతారు. చిన్న ప్రాజెక్టులు చేయాలంటే టైమ్ ఎలో చెయ్యదు. అందుకే… డైరెక్ట్‌గా కాకపోయినా.. దర్శకత్వ పర్యవేక్షకుడిగానో, మంచి కథల్ని అందజేస్తూనో చిన్న సినిమాల్ని టేకప్ చేసే ట్రెండ్ షురూ అయిందిప్పుడు. అనిల్ రావిపూడి లీడ్‌తో గాలి సంపత్ వస్తోంది. అటు.. జాతిరత్నాలు కూడా నాగ్అశ్విన్ ఇనిషియేటివ్‌తో వస్తున్నదే. సో.. దిల్‌రాజు చెప్పిన పాయింట్ ఇన్‌డైరెక్ట్‌గా వర్కవుటౌతున్నట్టే మరి.
Also Read:
ఓటీటీ ఎపిసోడ్ల మాదిరిగా పోర్న్ కంటెంట్.. వారానికో ఎపిసోడ్ రిలీజ్.. విచారణలో దిమ్మతిరిగే విషయాలు
చనిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఆమె మరణం అంతుచిక్కని మిస్టరీనే.. దెయ్యమే చంపిందా..?.. షాకింగ్ వీడియో