Aadi Saikumar: కొత్త సినిమా మొదలుపెట్టిన కుర్ర హీరో.. హీరోయిన్ ఎవరంటే..

|

Mar 12, 2022 | 7:37 AM

హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో ఆది సాయి కుమార్. చాలా కాలంగా సాలిడ్ హిట్ లేక ఈ కుర్ర హీరో సతమతం అవుతున్నాడు.

Aadi Saikumar: కొత్త సినిమా మొదలుపెట్టిన కుర్ర హీరో.. హీరోయిన్ ఎవరంటే..
Aadi Saikumar
Follow us on

Aadi Saikumar: హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో ఆది సాయి కుమార్. చాలా కాలంగా సాలిడ్ హిట్ లేక ఈ కుర్ర హీరో సతమతం అవుతున్నాడు. ఈ సారి ఎలాగైనా మంచి హిట్ కొట్టి తన సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత కె కె రాధామోహన్ ప్రస్తుతం ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో ఒక పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను రూపొందిస్తున్నారు. నిర్మాణ దశలో ఉన్న శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్‌లో 10వ‌ చిత్ర‌మిది. ఫణి కృష్ణ సిరికి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

కాగా, ఈ చిత్రంలో ఆది సాయికుమార్ సరసన కథానాయికగా నటించడానికి నటి దిగంగనా సూర్యవంశీని ఖ‌రారు చేశారు. తెలుగు, హిందీ భాషలలో కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లలో న‌టిస్తున్న దిగంగన ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమాలో మతిస్తున్నట్టు వెల్లడించారు చిత్ర యూనిట్. ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్ష‌లు తెలిపింది చిత్రయూనిట్.అలాగే ఈ చిత్రంలో ప్రతిభావంతులైన సాంకేతిక బృందం ప‌నిచేస్తోంది.. ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందిస్తుండగా, సతీష్ ముత్యాల కెమెరా బాథ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ చిత్రానికి గిడుతూరి సత్య ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్‌ సమర్పిస్తున్నారు. కొలికపోగు రమేష్‌ ఆర్ట్‌ డైరెక్టర్‌, ఫైట్స్‌ రామకృష్ణ చూసుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. మరి ఈ సినిమాతో ఆది సాయికుమార్ హిట్ కొడతాడేమో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: డిఫరెంట్ డ్రెస్సులతో పిచ్చెకిస్తున్న పూజ హెగ్డే.. చూస్తే వావ్ అనాల్సిందే

Surbhi: సరికొత్త లుక్ లో అందాల భామ సురభి… నెట్టింట ఫోటోస్ వైరల్

Radhe Shyam: రాధేశ్యామ్‌ స్లోగా ఉందన్న వారికి.. అదిరిపోయే పంచ్‌ ఇచ్చిన థమన్‌.. వైరల్‌ అవుతోన్న మీమ్‌..