Tollywood: ఈ అమ్మడు మామూల్ది కాదు.. ఆ స్టార్ హీరోల పెళ్లికి ఈమెకు లింక్ ఉందా..?

|

Oct 14, 2024 | 7:57 PM

వరుసగా ఆమె నటించిన హీరోలకు పెళ్లిళ్లు జరిగాయి. సినిమా రిలీజ్ అవ్వడం.. ఆ ఏడాదే ఆ హీరోకి పెళ్లి జరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.? స్టార్ హీరోయిన్ గా ఇప్పటికి రాణిస్తుంది ఆ భామ. అంతే కాదు త్వరలో ఆమె కూడా పెళ్లి పీటలు ఎక్కనుంది.

Tollywood: ఈ అమ్మడు మామూల్ది కాదు.. ఆ స్టార్ హీరోల పెళ్లికి ఈమెకు లింక్ ఉందా..?
Actress
Follow us on

సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి రకరకాల సెంటిమెంట్స్ ఉంటాయి. ఉదాహరణకు రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఆ హీరోకు ఖచ్చితంగా ఫ్లాప్ వస్తుంది అని అంటుంటారు. నిజంగానే రాజమౌళి సినిమా తర్వాత అందరికీ ఫ్లాప్స్ వచ్చాయి. కానీ దేవర సినిమాలో ఆ  సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది. అలాగే ఓ హీరోయిన్ విషయంలోనూ ఓ సెంటిమెంట్ ఉంది. ఆమెతో ఎవరో సినిమా చేసిన ఆ హీరోకు వెంటనే పెళ్లి జరిగిపోయింది. వరుసగా ఆమె నటించిన హీరోలకు పెళ్లిళ్లు జరిగాయి. సినిమా రిలీజ్ అవ్వడం.. ఆ ఏడాదే ఆ హీరోకి పెళ్లి జరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతకూ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.? స్టార్ హీరోయిన్ గా ఇప్పటికి రాణిస్తుంది ఆ భామ. అంతే కాదు త్వరలో ఆమె కూడా పెళ్లి పీటలు ఎక్కనుంది.

ఇది కూడా చదవండి : ఒంటరిగానే చూడాల్సిన సినిమా.. బోల్డ్ సీన్స్ దెబ్బకు థియేటర్స్‌లో బ్యాన్.. కానీ ఓటీటీలోకి..

ఒకానొక సమయంలో ఆమె నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్ అయ్యేయి. అలాగే ఆ హీరోలకు వెంటనే పెళ్లి కూడా జరిగింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఈ భామ చేసిన సినిమాలన్ని దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ అమ్మడి డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా ఎదురుచూసే వారు.

ఇది కూడా చదవండి : ఏంటి భయ్యా ఈ అమ్మడు.. మరీ ఇంత బాగుంది..! మహేష్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందంటే

ఇక తమన్నాతో సినిమా చేస్తే చాలు ఆ హీరోకు పెళ్లి అయ్యిపోతుంది అనే టాక్ అప్పట్లో టాలీవుడ్ లో గట్టిగా వినిపించింది. అందుకు కారణం ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, తమిళ్ హీరో కార్తీ. అవును ఈ నలుగురు హీరోలతో తమన్నా సినిమాలు చేసింది. ఆ ఏడాదే లేదా ఆతర్వాత ఏడాదో ఆ హీరోలకు పెళ్లి జరిగిపోయింది. ఎన్టీఆర్ తో ఊసరవెల్లి ఆ సమయంలోనే ఎన్టీఆర్ వివాహం జరిగింది. అలాగే రామ్ చరణ్ తో రచ్చ సినిమా చేసింది. ఆ మూవీ షూటింగ్ సమయంలోనే చరణ్ పెళ్లి జరిగింది. అదేవిధంగా అల్లు అర్జున్ తో తమన్నా బద్రీనాథ్ సినిమా చేసింది ఆ సినిమా సమయంలోనే బన్నీ పెళ్లి కూడా జరిగింది. వీరితో పాటు హీరో కార్తితో తమన్నా ఆవారా సినిమా చేసింది. ఆతర్వాత కార్తీ పెళ్లి కూడా జరిగింది. ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ , తమన్నా ఫన్నీగా మాట్లాడుకున్నారు. కాగా తమన్నా ప్రభాస్, రామ్ పోతినేనితో కూడా నటించింది కానీ ఈ ఇద్దరికీ పెళ్లి జరగాలేదు.

ఇది కూడా చదవండి :  ఇదెక్కడి మాస్ రా మావ..!! మోహన్ బాబు ఈ బాలీవుడ్ హాట్ బ్యూటీతో నటించారని తెలుసా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.