RRR మూవీలో తారక్ ఉపయోగించిన బైక్ గురించి ఆసక్తికర విషయాలు.. అందుకోసం జక్కన్న రీసెర్చ్

|

Dec 18, 2021 | 9:55 AM

జనవరి 7న భారతీయ మూవీ అభిమానుల కోసం RRR రూపంలో ఐ ఫీస్ట్ సిద్ధం చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

RRR మూవీలో తారక్ ఉపయోగించిన బైక్ గురించి ఆసక్తికర విషయాలు.. అందుకోసం జక్కన్న రీసెర్చ్
Rrr Ntr Bike
Follow us on

జనవరి 7న భారతీయ మూవీ అభిమానుల కోసం RRR రూపంలో ఐ ఫీస్ట్ సిద్ధం చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ కలిసి నటిస్తుండటం.. బాహుబలి తర్వాత రాజమౌళి తీసిన సినిమా అవ్వడంతో.. RRRపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచారు జక్కన్న అండ్ టీమ్. డిసెంబ‌ర్ 19న చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో గ్రాండ్‌గా జరగనుంది. బాలీవుడ్ బడా స్టార్స్ ఈ ఈవెంట్‌ను గ్రేస్ చేయనున్నారు. ఇక సినిమా గురించి అత్యంత కేర్ తీసుకునే వ్యక్తి రాజమౌళి. ప్రతి అంశాన్ని నిశితంగా గమనించి చెక్కుతారు కాబట్టే ఆయన్ను జక్కన్న అని పిలుస్తారు.  పాత్రలు.. వాటి నేపథ్యం మాత్రమే కాదు.. సినిమాలో ఉప‌యోగించే వ‌స్తువులను కూడా రాజ‌మౌళి స్పెష‌ల్‌గా డిజైన్ చేయిస్తుంటారు. అందుకే ఆయన చిత్రాల్లో హీరోలు ఉపయోగించే వెపన్స్ కూడా బాగా ఫేమస్ అవుతుంటాయి.

ఇక RRR విషయానికి వస్తే.. రామ్ చ‌ర‌ణ్ గుర్రాన్ని ఉప‌యోగిస్తే.. ఎన్టీఆర్ మోటార్ బైక్‌ను వినియోగించారు. అయితే ఎన్టీఆర్ వాడే బైక్ కోసం రాజమౌళి చాలా రీసెర్స్ చేశారట. బ్రిట‌న్‌కు చెందిన ఈ మోటార్ బైక్ పేరు వెలో సెట్. ఈ కంపెనీ హెడ్ ఆఫీసు బ‌ర్మింగ్ హామ్‌లో ఉంది. వెలోసెట్ మోటార్ బైక్ కంపెనీ 1920 నుంచి 1950 వ‌ర‌కు ఇంటర్నేషనల్‌ లెవల్‌లో మోటార్ రేసింగ్ విభాగంలో టాప్‌గా ఉండేదట. ప్రధానంగా 350 సీసీ, 500 సీసీ బైకుల‌ను త‌యారు చేసేదని తెలిసింది. 1971లో ఈ కంపెనీ బైకుల ఉత్ప‌త్తిని కంప్లీట్‌గా ఆపేసింది.

ఇక మూవీలో ఎన్టీఆర్ ఉప‌యోగించిన బైక్‌ 1934కి చెందిన ఎమ్ సిరీస్ మోడ‌ల్‌లా క‌నిపిస్తుంది. కేవ‌లం ఓ మ‌నిషి మాత్ర‌మే కూర్చోడానికి చోటు ఉండేలా స‌ద‌రు మోటార్ సైకిల్‌ను డిజైన్ చేశారు.   ఎన్టీఆర్‌కు బైక్ కావాలి అనుకున్నప్పుడు రాజ‌మౌళి రీసెర్చ్ చేశారట.  ఆ టైమ్‌లో బైకుల ఉత్ప‌త్తి చేయ‌డంలో ఎవ‌రు టాప్‌.. వారు త‌యారు చేసిన మోడ‌ల్స్ ఏంటి అనే వివరాలను సేకరించారట. ఇప్పుడున్న మోటార్ బైకునే అప్ప‌టి మోడ‌ల్‌లో క‌నిపించేలా దాదాపు ప‌ది లక్షలు ఖ‌ర్చు పెట్టి రీ మోడలింగ్ చేయించినట్లు తెలిసింది.

Also Read:  పిల్లలు కలగలేదని ఇల్లాలికి బొడ్డుతాడు తినిపించారు..పాపం చివరికి

వివాహేతర సంబంధం బయటపెడతానని భయపెట్టి వివాహితపై బాలుడు అత్యాచారం