Pragathi: నటి ప్రగతి కుమార్తెను చూశారా..? అమ్మ అందమే తనకి వచ్చింది..

ఇండస్ట్రీలో తొలుత హీరోయిన్‌గానే ప్రగతి జర్నీ ప్రారంభమైంది. హీరోయిన్‌గా మంచి అవకాశాలు వస్తున్నప్పుడే.. మ్యారేజ్ చేసుకుని సినిమాలకు కొన్నేళ్ల పాటు బ్రేక్‌ ఇచ్చారు ప్రగతి. ప్రగతి కుమార్తె ఇప్పుడు ఎలా ఉంది..? ఆమె ఏం చేస్తున్నారు..?

Pragathi: నటి ప్రగతి కుమార్తెను చూశారా..? అమ్మ అందమే తనకి వచ్చింది..
Pragathi
Follow us

|

Updated on: Jun 27, 2024 | 4:20 PM

తెలుగులో యంగ్‌ హీరోలకు, హీరోయిలకు మదర్, అత్త పాత్రలో ఎవరు సెట్‌ అవుతారు అని అడిగితే.. మొదట గుర్తుకు వచ్చే పేరు ప్రగతి. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆమె ఫుల్ పామ్‌లో ఉంది. సో కాల్డ్ సొసైటీని పెద్దగా పట్టించుకోకుండా.. తనకు నచ్చినపని చేస్తూ ఆమె ముందుకు సాగుతున్నారు. మీ తెలియని విషయం ఏంటంటే.. ఆమె తొలుత హీరోయిన్‌గానే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ప్రగతి హవా మాములుగా ఉండదు. ఫిట్‌నెస్ విషయంలో ఆమె యువతకు ఛాలెంజులు విసురుతూ ఉంటారు. ఆమె కసరత్తులు చూసి యంగ్ స్టర్స్ సైతం ఆశ్చర్యపోతూ ఉంటారు.

ప్రస్తుతం ఆమె ఏజ్ 48. ఈ వయస్సులోనూ 80 కేజీలను సునాయాసంగా ఎత్తగలరు. గత ఏడాది బెంగళూరులో 28వ బెంచ్ ప్రెస్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో ఆమె ప్రొఫెషనల్స్‌తో పోటీ పడి 3వ స్థానంలో నిలిచారు. అయితే వ్యక్తిగత జీవితంలో పడి లేచిన కెరటం ప్రగతి. చిన్న వయస్సులోనే మ్యారేజ్ చేసుకుని..  ఇద్దరు పిల్లల తల్లి అయ్యారు. ఆ తర్వాత భర్త నుంచి వేరు అవ్వడంతో.. పిల్లల పెంపకం, ఇతర బాధ్యతలు అన్ని ఆమె మీదే పడ్డాయి. అయినా ఎక్కడా వెరవకుండా.. ఇద్దరు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది. సినిమాలో కూతురు వేసే హీరోయిన్స్‌తో ప్రగతికి చక్కటి బాండింగ్ ఉంటుంది. ఇక రియల్ లైఫ్‌లోనూ కుమార్తె అంటే ఆమెకు ప్రాణం.  ప్రజంట్ ప్రగతి కుమార్తె గీత ఏజ్ 19. గీత కూడా తల్లి అందమే వచ్చింది. గీతకు సినిమాలవైపు ఆసక్తి ఉందో, లేదో తెలియాల్సి ఉంది. ప్రగతి కుమార్తె ఫోటోను దిగువన చూడండి.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..