Dhurandhar The Revenge: సినిమానే కాదు ట్రైలర్ కూడా రికార్డ్ బ్రేక్ చేసింది..

48 గంటల్లో 312 మిలియన్ల వ్యూస్ దాటి రికార్డ్ క్రియేట్ చేసిన జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ ధురంధర్ ది రివెంజ్ ట్రైలర్. జియో స్టూడియోస్, B62 స్టూడియోస్ మార్చి 7న ధురంధర్ ది రివెంజ్ ట్రైలర్‌ను విడుదల చేశాయి. ట్రైలర్ వెంటనే ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Dhurandhar The Revenge: సినిమానే కాదు ట్రైలర్ కూడా రికార్డ్ బ్రేక్ చేసింది..
Dhurandhar

Updated on: Mar 10, 2026 | 2:08 PM

రణవీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. హిందీలో విడుదలైన ఈ సినిమా సంచలన విజయం అందుకుంది. ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఇప్పుడు దురంధర్ ది రివెంజ్ పేరుతో ఆ సినిమాకు కొనసాగింపు రాబోతుంది. ఈ సినిమా నుంచి ఇటీవలే ట్రైలర్ ను విడుదల చేశారు. విడుదలైన కేవలం 48 గంటల్లోనే ట్రైలర్ ప్లాట్‌ఫామ్‌లలో 312 మిలియన్ల వ్యూస్ దాటింది, ఇది సినిమా చుట్టూ ఉన్న హ్యుజ్ బజ్ ని హైలైట్ చేసింది. ఇది 45+ దేశాలలో యూట్యూబ్ చార్ట్‌లలో ట్రెండింగ్‌లో ఉంది. ఇది గ్లోబల్ ఎట్రాక్షన్ ని ప్రజెంట్ చేస్తోంది.

ట్రైలర్‌లోని పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్ట్రైకింగ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ఆడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతూ, అనేక రీల్స్, ఫ్యాన్ ఎడిట్స్‌కు ప్రేరణగా మారింది. ఇదే సమయంలో గూగుల్ ట్రెండ్స్‌లో కూడా ఈ సినిమా, నటీనటులపై సెర్చ్‌లు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. జస్కిరత్ సింగ్ రంగీ, హమ్జా అలీ మజారి అనే రెండు విభిన్న పాత్రల్లో ఆయన కనిపిస్తూ కథలోని సంఘర్షణను మరింత ఇంటెన్స్ గా మలుస్తున్నారు.

సినిమాలో మరో ప్రధాన ఆకర్షణగా బలమైన నటీనటుల వున్నారు. ఆర్. మాధవన్ వ్యూహాత్మక మాస్టర్‌మైండ్ అజయ్ సన్యాల్, అర్జున్ రాంపాల్ ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్ పాత్రలో విలన్‌గా, అలాగే సంజయ్ దత్ ఎస్‌పీ చౌధరి అస్లంగాపవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. జియో స్టూడియోస్ సమర్పణలో, B62 స్టూడియోస్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ హై-ఆక్టేన్ స్పై యాక్షన్ చిత్రానికి ఆదిత్య ధర్ కథ, దర్శకత్వం అందించగా జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 19న గుడి పాడ్వా, ఉగాది పండుగల సందర్భంగా, ఈద్‌కు ముందు ‘ధురంధర్: ది రివెంజ్’ థియేటర్లలో విడుదల కానుంది. అజ్ఞాత వీరుల కథ ప్రపంచవ్యాప్తంగా 2026 మార్చి 19న థియేటర్లలోకి రాబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us