తన వివాహ డాక్యుమెంటరీ విడుదలను నటుడు ధనుష్ అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ నటి నయనతార తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన లెటర్ ఎంత దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయన్ ధనుష్ పై చేసిన కామెంట్స్ కోలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. నయనతార 2022లో దర్శకుడు విఘ్నేష్ శివన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు ఇద్దరు కవలలు. నయనతార, విఘ్నేష్ శివన్ వివాహ వీడియోను నెట్ఫ్లిక్స్ ఓటీటీలో విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ పెళ్లయిన రెండేళ్ల తర్వాత ఆ డాక్యుమెంటరీ విడుదల కాలేదు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ను నెట్ఫ్లిక్స్ విడుదల చేసింది.
తన జీవితం గురించిన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ ధాన్ చిత్రంలోని విజువల్స్, పాటలు అలాగే సన్నివేశాలు ఉపయోగించినందుకు ధనుష్ రూ.10 కోట్లు డిమాండ్ చేసి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అందించడానికి నిరాకరించారని నయనతార ఆరోపించారు. ఇదిలా ఉంటే తాజాగా ధనుష్ కు సంబందించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో నయన్ గురించి ధనుష్ మాట్లాడాడు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది.
విజయ్ టీవీలో కాఫీ విత్ డీడీ అనే షోలో 2013లో ఇచ్చిన ఇంటర్వ్యూ కు సంబందించిన క్లిప్ ఇది. ధనుష్, శివకార్తికేయన్ ఎథిర్ నీచల్ చిత్రానికి నయనతార చేసిన కృషిని ప్రశంసించారు. ధనుష్ నిర్మించిన ఈ సినిమాలో నయనతార స్పెషల్ సాంగ్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో శివకార్తికేయన్ మాట్లాడుతూ.. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ నయనతార సంకోచం లేకుండా పాట చేయడానికి అంగీకరించిందని పేర్కొన్నాడు. ధనుష్ మాట్లాడుతూ..సాంగ్ కోసం ఆమె డబ్బు కూడా అడగలేదు, ‘నువ్వు నా స్నేహితుడివి, నేను డబ్బు తీసుకోను’ అని చెప్పిందని అలా ఆ పాటను ఫ్రీగా చేసిందని ధనుష్ తెలిపాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.