Devara First Day Collections: ఎన్టీఆర్ క్రేజ్ ఇది.. ‘దేవర’ సంచలనం.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే..

ముఖ్యంగా ఎన్టీఆర్ యాక్టింగ్, డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ 20 నిమిషాలు, యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. చాలా కాలం తర్వాత మరోసారి తారక్ తన మాస్ నట విశ్వరూపం చూపించాడని.. దేవర హిట్టు అంటూ నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

Devara First Day Collections: ఎన్టీఆర్ క్రేజ్ ఇది.. 'దేవర' సంచలనం.. తొలిరోజు కలెక్షన్స్ ఎంత వచ్చాయంటే..
Devara First Day Collections
Follow us

|

Updated on: Sep 28, 2024 | 8:01 AM

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘దేవర’ సినిమాకు తొలి రోజే ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దాదాపు ఆరేళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదలైంది. ఇందులో తారక్ సరసన తంగం పాత్రలో జాన్వీ కపూర్ నటించగా.. విలన్ బైరా పాత్రలో సైఫ్ అలీ ఖాన్ కనిపించారు. నిన్న ఉదయమే సూపర్ హిట్ టాక్ అందుకున్న ఈ సినిమాకు అదే స్థాయిలో రివ్యూ్స్ కూడా వచ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ యాక్టింగ్, డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్ 20 నిమిషాలు, యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. చాలా కాలం తర్వాత మరోసారి తారక్ తన మాస్ నట విశ్వరూపం చూపించాడని.. దేవర హిట్టు అంటూ నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

ఇక దేవర తొలి రోజు బాక్సాఫీస్ వద్ద అద్బుతమైన ఓపెనింగ్ సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొదటి రోజే అడ్వాన్స్ బుకింగ్స్ లో దేవర సినిమాకు అదిరిపోయే స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఫస్ట్ డే దేవర సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.140 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో దేవర తన బలమైన స్థానాన్ని ప్రదర్శించింది. మన దేశంలో అన్ని భాషలలో కలిపి దాదాపు రూ.77 కోట్లు రాబట్టినట్లు సమాచారం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భీభత్సం సృష్టించింది దేవర. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిన్న ఒక్కరోజే రూ.68.6 కోట్లు కలెక్షన్స్ వచ్చాయట. ఇక ఇతర భాషలలో చూస్తే.. హిందీలో రూ.7 కోట్లు.. కన్నడలో రూ.0.3 కోట్లు.. తమిళంలో రూ.0.8 కోట్లు, మలయాళంలో రూ.0.3 కోట్లు వచ్చినట్లు సమాచారం.

ప్రపంచవ్యాప్తంగా రూ. 140 కోట్ల గ్రాస్ కలెక్షన్‌లో ఓవర్సీస్ మార్కెట్‌ల నుండి వచ్చిన ఆదాయం కూడా ఉంది. మొత్తానికి దేవర చిత్రానికి వరల్డ్ వైడ్ గ్రాండ్ వెల్ కమ్ లభించింది. ఈ సినిమాలో తారక్ యాక్టింగ్, అనిరుధ్ మ్యూజిక్, గ్రాండ్ విజువల్స్, ఆకట్టుకునే కథాంశం హైలెట్ అయ్యాయి. పాజిటివ్ మౌత్ టాక్ అందుకున్న ఈ సినిమాకు రెండో రోజు కూడా మరిన్ని వసూళ్లు పెరిగే అవకాశం ఉంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై కొసరాజు హరికృష్ణ, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దేవర ఫస్ట్ డే కలెక్షన్స్.. దిమ్మతిరిగిపోవాల్సిందే..
దేవర ఫస్ట్ డే కలెక్షన్స్.. దిమ్మతిరిగిపోవాల్సిందే..
డ్రైవర్‌ సహా మంటల్లో తగలబడిపోతున్న కారు.. స్థానికులు ఏం చేశారంటే
డ్రైవర్‌ సహా మంటల్లో తగలబడిపోతున్న కారు.. స్థానికులు ఏం చేశారంటే
సెయిల్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ విలీనం..! అదే జరిగితే..
సెయిల్‌లో వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ విలీనం..! అదే జరిగితే..
మహిళల్లో కనిపించే ఈ లక్షణాలు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు..
మహిళల్లో కనిపించే ఈ లక్షణాలు.. క్యాన్సర్‌కు సంకేతాలు కావొచ్చు..
సాయి పల్లవి ఈజ్ బ్యాక్.. అద్భుతమైన పాత్రతో న్యాచురల్ బ్యూటీ..
సాయి పల్లవి ఈజ్ బ్యాక్.. అద్భుతమైన పాత్రతో న్యాచురల్ బ్యూటీ..
వార్నీ.. ఒకే ఒక్క పాప్‌కార్న్‌ తయారీ కోసం క్యూ కట్టిన నెటిజన్లు..
వార్నీ.. ఒకే ఒక్క పాప్‌కార్న్‌ తయారీ కోసం క్యూ కట్టిన నెటిజన్లు..
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. అందుకోసం కొత్తగా 10 బస్సు డీపోలు..
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. అందుకోసం కొత్తగా 10 బస్సు డీపోలు..
మణికంఠకే గోల్డెన్ బ్యాండ్.. ఇరగదీసిన నబీల్..
మణికంఠకే గోల్డెన్ బ్యాండ్.. ఇరగదీసిన నబీల్..
ఇప్పట్లో తగ్గేటట్టు లేవుగా.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
ఇప్పట్లో తగ్గేటట్టు లేవుగా.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!