TGRTC: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. అందుకోసం కొత్తగా 10 బస్సు డీపోలు..

ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం నూతన డిపోలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అన్ని జిల్లాలకు ఎలక్ట్రిక్‌ బస్సుల్ని విస్తరిస్తున్న తరుణంలో కొత్తగా 10 బస్‌ డిపోలు అవసరపడతాయని ఆర్టీసీ తన ప్రతిపాదలనో తెలిపింది. గతేడాది ఆర్టీసీకి డీజీల్‌ రూపంలో మొత్తం...

TGRTC: తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. అందుకోసం కొత్తగా 10 బస్సు డీపోలు..
Tgrtc
Follow us

|

Updated on: Sep 28, 2024 | 7:00 AM

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతోన్న విషయం తెలిసిందే. ప్రజలు పెద్ద ఎత్తున ఈ వాహనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే అదే సమయంలో ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగానికి మొగ్గుచూపుతున్నాయి. ఇందులో ముందు వరుసలో నిలుస్తోంది తెలంగాణ ఆర్టీసీ. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు రూట్లలో ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులను నడిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఎలక్ట్రిక్‌ బస్సుల్ని ప్రవేశపెట్టాలని ఆర్టీసీ భావిస్తోంది.

ఇందులో భాగంగానే తాజాగా తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం నూతన డిపోలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అన్ని జిల్లాలకు ఎలక్ట్రిక్‌ బస్సుల్ని విస్తరిస్తున్న తరుణంలో కొత్తగా 10 బస్‌ డిపోలు అవసరపడతాయని ఆర్టీసీ తన ప్రతిపాదలనో తెలిపింది. గతేడాది ఆర్టీసీకి డీజీల్‌ రూపంలో మొత్తం రూ. 1522 కోట్ల ఖర్చయింది. ఇది మొత్తం ఖర్చులో 22.7 శాతం దీంతో ఇంధన భారాన్ని తగ్గించుకునే దిశగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు పెద్ద పీట వేస్తోంది. అయితే ప్రస్తుతం కేవలం హైదరాబాద్‌తో పాటు విజయవాడకు మాత్రమే ఎలక్ట్రిక్‌ బస్సులు నడపిస్తున్న ఆర్టీసీ.. ఇకపై జిల్లాలకు కూడా విస్తరించే ఆలోచనలో ఉంది.

కొత్తగా ఏర్పాటు చేయనున్న డిపోలకు ఒక్కో డిపో ఏర్పాటుకు రూ. 10 కోట్ల చొప్పున మొత్తం రూ. 100 కోట్లు.. అలాగే ఒక్కో డిపోకు 10 ఎకరాల చొప్పు మొత్తం 100 ఎకరాల భూమి కావాలని ప్రభుత్వాన్ని ఆర్టీసీ కోరింది. ఇక ఎలక్ట్రిక్‌ బస్సులకు ఛార్జింగ్ కోసం 33 కేవీ హై టెన్షన్ విద్యుత్‌ సరఫరా అవసరమని ఆర్టీసీ ఆలోచిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేయబోయే 10 డిపోలతో పాటు 19 పాత బస్‌ డిపోలకు హైటెన్షన్‌ విద్యుత్‌ సరఫరాకు మరో రూ.232 కోట్లు అవసరపడతాయని ప్రాథమిక అంచనా వేస్తోంది.

ఇప్పటికే ఉన్న హైదరాబాద్‌లోని కోఠి, హయత్‌నగర్‌ వంటి 10 టెర్మినల్‌ పాయింట్లలో ఇంటర్మీడియట్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు అవసరమని చెబుతోంది ఆర్టీసీ. దీని కోసం ఒక్కోచోట 2 వేల చదరపు మీటర్ల స్థలం కావాలని.. ఇంటర్మీడియట్‌ ఛార్జింగ్‌ స్టేషన్లకు రూ.6 కోట్ల చొప్పున రూ.60 కోట్ల ఖర్చవుతుందని లెక్కలు వేసింది. మొత్తంమీద తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంలో శరవేగంగా అడుగులు వేస్తోందని చెప్పొచ్చు.

మరిన్ని తెలంగాణ వార్త కోసం క్లిక్ చేయండి..

వార్నీ.. ఒకే ఒక్క పాప్‌కార్న్‌ తయారీ కోసం క్యూ కట్టిన నెటిజన్లు..
వార్నీ.. ఒకే ఒక్క పాప్‌కార్న్‌ తయారీ కోసం క్యూ కట్టిన నెటిజన్లు..
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. అందుకోసం కొత్తగా 10 బస్సు డీపోలు..
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం.. అందుకోసం కొత్తగా 10 బస్సు డీపోలు..
మణికంఠకే గోల్డెన్ బ్యాండ్.. ఇరగదీసిన నబీల్..
మణికంఠకే గోల్డెన్ బ్యాండ్.. ఇరగదీసిన నబీల్..
ఇప్పట్లో తగ్గేటట్టు లేవుగా.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
ఇప్పట్లో తగ్గేటట్టు లేవుగా.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..
Horoscope Today: వారు ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్త..
డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
డయాబెటిస్‌ రోగులు బంగాళా దుంపలు తినొచ్చా? తినకూడదా?
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
తిరుమలలో వెలసిన డిక్లరేషన్‌ బోర్డులు జగన్‌ పర్యటన రద్దుతోతొలగింపు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..
రా మచ్చ మచ్చ అంటున్న రామ్ చరణ్.! థియేటర్స్ షేకే..
వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..
వేగంగా బరువు తగ్గాలంటే ఆ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు..
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
కెమెరాలు తీసుకుని బయటకు నడవండి.! మీడియాపై సైనికుల దాడి.
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
ఆ ఎయిర్‌పోర్ట్‌ యమ డేంజర్.! 50 మంది పైలట్లు మాత్రమే ల్యాండింగ్‌..
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
హైదారాబాద్ లో భారీ చోరీ! తాళం పగలగొట్టి రూ.2 కోట్లు ఎత్తుకెళ్లారు
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
లెబనాన్‌ ఘటనపై ఎక్స్‌లో వెల్లడించిన ఇజ్రాయెల్‌.! ఆ ముగ్గురు తప్ప!
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
30 ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌‌లో దాచిపెట్టిన హంతకుడు.! 8 బృందాలు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
అది మనుషుల ఆస్పత్రా.. కుక్కల డెన్నా.? ఆస్పత్రిలో కుక్కల గుంపు..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
గ్రీన్‌ కార్డ్‌ హోల్డర్స్‌కు గుడ్‌న్యూస్‌.! కార్డ్‌ వ్యాలిడిటీ..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
పింఛన్‌దారులకు శుభవార్త.! ఇకపై ఇంటి నుంచే లైఫ్‌ సర్టిఫికెట్‌..
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!
క్లాస్‌లో లెక్చరర్‌ పాఠాలు చెప్తుండగా షాక్.! భయంతో స్టూడెంట్స్‌.!